AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Teja: వారసుడు వచ్చేస్తున్నాడు.. హీరోగా డైరెక్టర్ తేజ కుమారుడు.. హీరోయిన్‌గా కృష్ణ మనవరాలు

టాలీవుడ్‌ దర్శకుడు తేజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారాయన. ముఖ్యంగా ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పుడు తేజ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడు.

Director Teja: వారసుడు వచ్చేస్తున్నాడు.. హీరోగా డైరెక్టర్ తేజ కుమారుడు.. హీరోయిన్‌గా కృష్ణ మనవరాలు
Director Teja
Basha Shek
|

Updated on: Aug 17, 2025 | 5:07 PM

Share

చిత్రం, నువ్వునేను, జయం, సంబరం, జై, ధైర్యం, ఔనన్నా కాదన్నా.. ఇలా ఎన్నో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారు డైరెక్టర్ తేజ. అంతేకాదు తన సినిమాల ద్వారా ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, కాజల్ అగర్వాల్, ప్రిన్స్, నందిత వంటి స్టార్ హీరోలు, హీరోయిన్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే గత కొన్నేళ్లుగా తేజకు సరైన సినిమాలు పడడం లేదు. 2017లో ఆయన తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మాత్రమే హిట్ గా నిలిచింది. దీనికి ముందు, తర్వాత తేజకు చాలా ఫ్లాప్ లు పడ్డాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగానే ఉన్న తేజ సరైన కథతో సక్సెస్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తన కుమారుడిని కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో తేజ ఉన్నట్లు తెలుస్తోంది. తన దర్శకత్వంలోనే ఒక ప్రేమకథతో అమితవ్‌ను హీరోగా లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు షోషల్‌మీడియాలో కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కాగా సుమారు రెండేళ్ల క్రితం విక్రమాదిత్య పేరుతో ఒక పీరియాడిల్‌ ఎపిక్‌ లవ్‌స్టోరీని ప్రకటించారు తేజ. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా అప్పట్లోనే విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈసినిమాతోనే తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే ‘విక్రమాదిత్య’ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
Director Teja

Director Teja Son

హీరోయిన్‌గా ఘట్టమనేని వారసురాలు

ఇక్కర మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇదే విక్రమాదిత్య ప్రాజెక్టుతో దివంగత నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ మనవరాలు, రమేష్‌బాబు కుమార్తె అయిన భారతిని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు గత కొన్ని రోజులుగా భారతి ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలవుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

పెళ్లి వేడుకలో ఘట్టమనేని భారతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.