చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గర్వంగా ఉందన్న రోజా
రోజా సెల్వమణి.. సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మెప్పించిన రోజా.. ఇప్పుడు రాజకీయనాయకురాలిగా రాణిస్తున్నారు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. సినిమాల్లోకి వచ్చాక రొజాగా మార్చుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు రోజా.

ఒకప్పటి హీరోయిన్, రాజకీయ నాయకురాలు ఆర్కే రోజా, తన సుదీర్ఘ సినీ, రాజకీయ ప్రయాణం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాల్యం గురించి, మెగా కుటుంబంతో తన అనుబంధం గురించి అనేక విషయాలను వెల్లడించారు. చిన్నతనంలో రామ్ చరణ్ చాలా అల్లరి పిల్లవాడని, ‘ముఠామేస్త్రి’ షూటింగ్ సమయంలో ఊటీకి వచ్చినప్పుడు తెగ అల్లరి చేసేవాడని రోజా గుర్తుచేసుకున్నారు. అయితే, ఊటీలోని పాఠశాలలో చేరిన తర్వాత అతను చాలా సైలెంట్‌గా మారిపోయాడని, అది చూసి తాను ఆశ్చర్యపోయానని ఆమె తెలిపారు. ట్రిపుల్ ఆర్ చిత్రంలోని రామ్ చరణ్ మొదటి షాట్‌ను చూసినప్పుడు, ఒక మెగా అభిమానిగా, మెగా కుటుంబానికి సన్నిహితురాలిగా చాలా గర్వంగా అనిపించిందని రోజా అన్నారు. రామ్ చరణ్ డాన్స్ లో అతని తండ్రి, చిరంజీవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని, బాల్యం నుంచే అతను చిరంజీవి పాటలకు డాన్స్ చేసేవాడని ఆమె వెల్లడించారు.
ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా
చిరంజీవి కుటుంబంతో తమకు ఎంతో సన్నిహిత సంబంధం ఉందని రోజా వివరించారు. చెన్నైలోని టీ. నగర్‌లో నవీన్ ఇంటర్నేషనల్ పక్కన ఉన్న వారి ఇంటికి తాము రెగ్యులర్‌గా వెళ్లేవారమని, వారి పుట్టినరోజు వేడుకలు, సిస్టర్స్ వివాహాలు వంటి అన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో తాము పాల్గొనేవారమని ఆమె పేర్కొన్నారు. తాను ఇటీవల హోమ్ టూర్ చేసినప్పుడు కూడా ఆ ఇల్లు అదే విధంగా ఉందని, ఏ మార్పులు లేవని తెలిపారు. 90ల నాటి హీరో హీరోయిన్ల పట్ల ప్రస్తుత తరం నటులకు గొప్ప గౌరవం, మర్యాద ఉందని, తమతో కలిసి పని చేయాలని వారు కోరుకుంటారని ఆమె ప్రశంసించారు.
ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది
సినిమాలలో నటించకపోవడం వెనుక గల కారణాలను వివరిస్తూ, తన బిజీ షెడ్యూల్ వల్ల కేవలం టీవీ షోలకే పరిమితం అయ్యానని రోజా చెప్పారు. టీవీ ఎపిసోడ్‌లను తన పరిమిత సమయంలో పూర్తి చేయవచ్చని, కానీ సినిమాకు హీరో హీరోయిన్ల డేట్స్ తో మ్యాచ్ చేయాల్సి ఉంటుందని, ఎక్కువ రోజులు కేటాయించడం కష్టమని ఆమె తెలిపారు. ఈ కారణంగానే తాను సినిమాల గురించి ఆలోచించలేదని, ఎవరు ఆఫర్లు ఇస్తారు, ఎవరు ఇవ్వరు అనే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాలు, సినీ పరిశ్రమ మధ్య సంబంధాలపై కూడా రోజా తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాజకీయాల వల్ల సినీ అవకాశాలు తగ్గుతాయనే ప్రచారం గురించి తనకు తెలియదని, అయితే రాజకీయ నాయకులు సినిమా నటుల కంటే ఎక్కువగా నటిస్తారని రోజా చెప్పుకొచ్చారు.




