AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు మూవీ.. IMDBలో 8.7 రేటింగ్ మూవీ.. అసలు మిస్ అవ్వద్దు

ఇటీవల డిఫరెంట్ స్టోరీతో వచ్చిన తెలుగు సినిమాల్లో ఇదొకటి. తనకున్న లోపం కారణంగా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ (అభద్రతా భావం) తో సతమతమయ్యే ఓ యువకుడి ప్రేమ కథే ఈ సినిమా. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై ఆకట్టుకున్న ఈ మూవీ గురువారం (ఫిబ్రవరి 26) ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు మూవీ.. IMDBలో 8.7 రేటింగ్ మూవీ.. అసలు మిస్ అవ్వద్దు
Sri Chidambaram Garu Movie
Basha Shek
|

Updated on: Feb 26, 2026 | 7:51 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో కొత్త సినిమాల సందడి మొదలైంది. కొత్త సినిమాలతో పాటు థియేటర్లలో రిలీజైన చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా గురువారం (ఫిబ్రవరి 26) కూడా ఓ తెలుగు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 06న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. మలయాళం సినిమాల మాదిరి వాస్తవికతకు దగ్గరగా ఈ మూవీ ఉండడంతో పాజిటివ్ రివ్యూలు అందుకుంది. అయితే అందరూ చిన్న నటులే ఉండడం, పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అందుకే థియేటర్లలో రిలీజైన మూడు వారాల గ్యాప్ లోనే ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది.

ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. హీరోకు మెల్ల కన్ను ఉంటుంది. దీంతో చిన్నప్పట్నుంచే ఆత్మన్యూన‌తతో బాధపడుతుంటాడు. తన లోపాన్ని కవర్ చేసేందుకు నళ్లటి క‌ళ్లద్దాలు ధ‌రిస్తుంటాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ ఇంటి అప్పులను తీరుస్తుంటాడు. ఇదే క్రమంలో అదే ఊరిలో ఉండే లీల అనే అమ్మాయితో హీరో ప్రేమలో పడతాడు. కానీ తనకున్న మెల్లకన్ను కారణంగా ఆ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు సంకోచిస్తాడు. కానీ ఒక రోజు ధైర్యం చేసుకుని లీలకు తన ప్రేమ విషయాన్ని చెబుతాడు హీరో. మరి హీరోయిన్ హీరో ప్రేమను అంగీకరించిందా? రిజెక్ట్ చేసిందా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

గురువారం అర్ధ రాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా పేరు శ్రీ చిదంబరం గారు. వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇవాళే OTTకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా.. IMDBలో 8.7 రేటింగ్
ఇవాళే OTTకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా.. IMDBలో 8.7 రేటింగ్
నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా?.. ఈ సింపుల్ టెస్టులతో నకిలీకి చె
నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా?.. ఈ సింపుల్ టెస్టులతో నకిలీకి చె
పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! మన రాష్ట్రంలోనే..
పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! మన రాష్ట్రంలోనే..
ఈ చార్జీలు ఉండవు.. బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
ఈ చార్జీలు ఉండవు.. బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
డైటింగ్ చేస్తున్నారా?.. ఆకలిని చంపి, ఎనర్జీనిచ్చే పవర్ఫుల్ స్నాక్
డైటింగ్ చేస్తున్నారా?.. ఆకలిని చంపి, ఎనర్జీనిచ్చే పవర్ఫుల్ స్నాక్
అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..?
అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..?
15 నెలల సంజనకు కొత్త కుటుంబం,శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
15 నెలల సంజనకు కొత్త కుటుంబం,శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 25 ఏళ్లుగా సినిమాలకు దూరం
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 25 ఏళ్లుగా సినిమాలకు దూరం
ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..