Pankaj Dheer: కర్ణుడి పాత్రతో కీర్తితో సంపాదన వేట మొదలు.. పంకజ్ మొత్తం ఆస్తి విలువ ఎంతంటే..
బుల్లి తెరపై సంచలనం మహా భరతం సీరియల్. బాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ అలరించిన ఈ సీరియలో నటించిన ప్రతి ఒక్క నటుడు బుల్లి తెర ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. మహాభారతంలోని కర్ణుడిని తలచుకుంటే వెంటనే పంకజ్ ధీర్ గుర్తుకొస్తారు. అంతగా కర్ణుడి పాత్రలో జీవించారు. అలాంటి పంకజ్ ధీర్ క్యాన్సర్ బారిన పడి మరణించారు. దీంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పంకజ్ ధీర్ ఒక మంచి నటుడు మాత్రమే కాదు..తన కృషి , అంకితభావం తో అతను కోట్ల విలువైన కీర్తి , సంపద రెండింటినీ సంపాదించాడు.

మహాభారతంలో కర్ణుడి పాత్రలో అత్యంత ప్రధాన పాత్ర. శక్తివంతమైన పాత్ర. అటువంటి కర్ణుడు పాత్రలో పంకజ్ ధీర్ నటించలేదు.. జీవించారని చెప్పవచ్చు. గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకు పంకజ్ ధీర్ అక్టోబర్ 14వ తేదీన 68 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన మరణం టెలివిజన్ , చలనచిత్ర పరిశ్రమలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
కెరీర్ సంపాదన, కీర్తి , గుర్తింపు 1988లో బిఆర్ చోప్రా “మహాభారతం”లో కర్ణుడి పాత్ర పోషించినప్పుడు పంకజ్ ధీర్ మొదటగా కీర్తిని పొందాడు. అతని పాత్ర ఎంత ప్రజాదరణ పొందిందంటే ప్రేక్షకులు ఇప్పటికీ అతన్ని ఆ పేరుతోనే గుర్తుంచుకుంటారు. ఆ తరువాత అతను చంద్రకాంత, యుగ్ , ది గ్రేట్ మరాఠా వంటి ప్రముఖ సీరియల్స్‌తో పాటు అనేక బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు.
తన సుదీర్ఘ కెరీర్‌లో నటన ద్వారా అతను గణనీయమైన మొత్తాన్ని సంపాదించాడు. primeworld.comలోని ఒక నివేదిక ప్రకారం.. అతను ఎపిసోడ్‌కు దాదాపు రూ.60,000 తీసుకునేవాడు. సాధక్, బాద్షా , సోల్జర్స్ వంటి చిత్రాలలో కూడా గుర్తుండిపోయే పాత్రలు పోషించాడు.
మొత్తం సంపద ఎంత? మీడియా నివేదికల ప్రకారం పంకజ్ ధీర్ ఆస్తులు దాదాపు రూ.42 కోట్లు (సుమారు $42 మిలియన్ USD) ఉన్నాయి. ఇందులో ముంబై , పంజాబ్‌లోని ఆస్తులు, అతని బ్యాంక్ బ్యాలెన్స్, పెట్టుబడులు, వ్యాపార ఆదాయం ఉన్నాయి. అతను సినిమాలు, టీవీ సీరియల్స్, అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా డబ్బు సంపాదించాడు. అతని వార్షిక ఆదాయం ₹1.44 కోట్లు (సుమారు $1.44 మిలియన్ USD) దాటి ఉండేదని చెబుతారు.
నటనతో పాటు, వ్యాపారంలో కూడా చురుకుగా 2006లో పంకజ్ ధీర్ తన సోదరుడుతో కలిసి ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో విజయ్ స్టూడియోస్ అనే రికార్డింగ్ , ప్రొడక్షన్ స్టూడియోను ప్రారంభించారు. ఈ స్టూడియో ద్వారా వారు కొత్త కళాకారులు, ప్రాజెక్టులకు ఒక వేదికను అందించారు. ఇది వారికి గణనీయమైన ఆదాయాన్ని అందించింది. చిత్రనిర్మాణంలో తీవ్రమైన ఆసక్తిని కూడా పెంచుకున్నారు.
కుటుంబం, వ్యక్తిగత జీవితం పంకజ్ ధీర్ నవంబర్ 9, 1956న ముంబైలో జన్మించాడు. అయితే పంకజ్ కుటుంబ మూలాలు పంజాబ్‌కు చెందినవి. అతను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. టీవీ పరిశ్రమలో నటుడుగా అడుగు పెట్టి తనకంటూ ఓ పేరుని సంపాదించుకున్నాడు. అనితా ధీర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నికితిన్ ధీర్ అనే కుమారుడు ఉన్నాడు. నికితిన్ ధీర్ కూడా “చెన్నై ఎక్స్‌ప్రెస్” వంటి చిత్రాలలో పనిచేశారు. నికితిన్ ధీర్ నటి క్రాతిక సెంగర్‌ను వివాహం చేసుకున్నారు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







