AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Vinod: వారిని నమ్మి రూ. 21 లక్షలు పోగొట్టుకున్న జబర్ధస్థ్ వినోద్.. కమెడియన్ జీవితంలో కష్టాలెన్నో..

అతడికి ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ రావడంతో బక్క చిక్కపోయి పూర్తిగా గుర్తుపట్టలేని స్థితికి వచ్చా డు. మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని.. అయినా సరే తాను తిరిగి కోలుకుని అందరినీ ఎంటర్టైన్ చేస్తానని నమ్మకంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే తన జీవితంలో కొందరిని నమ్మి తాను భారీగానే కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు.

Jabardasth Vinod: వారిని నమ్మి రూ. 21 లక్షలు పోగొట్టుకున్న జబర్ధస్థ్ వినోద్.. కమెడియన్ జీవితంలో కష్టాలెన్నో..
Vinod
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 18, 2022 | 3:23 PM

Share

జబర్దస్త్ వినోద్.. అనగానే ఠక్కున ఓ అందమైన అమ్మాయి రూపం గుర్తుకు వచ్చేస్తుంది. లేడీ గెటప్ వేస్తూ… తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు జబర్దస్త్ వినోద్. చమ్మక్ చంద్ర.. వినోద్ కాంబోలో వచ్చే ప్రతి స్కిట్ సూపర్ అనే చెప్పుకొవాలి. చమ్మక్ చంద్ర పంచులు.. అందుకు వినోద్ సెటైర్స్ ఆడియన్స్ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందించేవారు. అయితే వినోద్ కొద్ది రోజులుగా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. మరికొన్ని ఛానల్స్ లో ఆయా షోలలో కనిపించాడు. జీవితంలో చెప్పుకోలేని కష్టాలు ఉన్నా.. లేడీ గెటప్స్ వేసి ప్రేక్షకులను నవ్వించాడు. ఈక్రమంలో ఇప్పుడు వినోద్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. అతడికి ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ రావడంతో బక్క చిక్కపోయి పూర్తిగా గుర్తుపట్టలేని స్థితికి వచ్చా డు. మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని.. అయినా సరే తాను తిరిగి కోలుకుని అందరినీ ఎంటర్టైన్ చేస్తానని నమ్మకంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే తన జీవితంలో కొందరిని నమ్మి తాను భారీగానే కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు.

ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ వినోద్ మాట్లాడుతూ.. సొంతంగా ఇల్లు కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తికి రూ. 13 లక్షలు ఇచ్చి మోసపోయానని అన్నారు. ఇల్లు కొనేందుకు ఇంటి యజమానితో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ గా రూ. 13 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. నోటి మాట ద్వారా రూ. 3 లక్షలు.. లిఖిత పూర్వకంగా రూ. 10 లక్షలు ఇచ్చానని అన్నారు. అయితే సదరు వ్యక్తి వినోద్ ను వేధిస్తుండడంతో పాటు డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదని.. గతేడాది కాలంగా తిరుగుతున్నా తనకు న్యాయం దొరకలేదని అన్నారు . ఆ డబ్బుల కోసం ఇంకా పోరాటం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆ ఇంటి యజమానికి ఇచ్చిన రూ. 10 లక్షలకు ప్రూఫ్ ఉందని.. రూ. 3 లక్షలకు మాత్రం ఎలాంటి ప్రూఫ్ లేదని అన్నారు. ఇల్లు కొనడం కోసం రూ. 13 లక్షలు మోసపోయిన వినోద్..మరో వ్యక్తిని నమ్మి 5 లక్షలు కోల్పోయారట. తెలిసిన వ్యక్తికి ఎవరో అప్పు ఇస్తే.. గ్యారంటీగా వినోద్ ఉన్నారు. ఇద్దరి మధ్య షూరిటీ ఇవ్వడం వల్ల తాను రూ. 5 లక్షలు అప్పు చెల్లించానని.. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మరో రూ. 3 లక్షలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఊపిరితిత్తుల్లోకి నీరు రావడంతో సన్నగా అయ్యానని.. ట్రీట్మెంట్ ఖర్చులు కలిపి మొత్తం రూ. 3 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. అలా తన జీవితంలో ఎంత కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని సంపాదించుకున్న ఆస్తి రూ. 21 లక్షల వరకు కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తను తిరిగి కోలుకుంటానని.. ప్రేక్షకుల ముందుకు మళ్లీ వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us
సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు
సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు
నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
యుద్ధం.. రైతులకు కష్టాలు తప్పేలా లేవు!
యుద్ధం.. రైతులకు కష్టాలు తప్పేలా లేవు!
ఉస్తాద్ అంచనాలు పెరిగిపోతున్నాయి.. పవన్ సినిమా అంటే ఆ మాత్రం..
ఉస్తాద్ అంచనాలు పెరిగిపోతున్నాయి.. పవన్ సినిమా అంటే ఆ మాత్రం..
అడక్కుండానే లిఫ్ట్ ఇచ్చాడు.. ఎంత మంచోడో అనుకునేరు.. కాసేపటికి..
అడక్కుండానే లిఫ్ట్ ఇచ్చాడు.. ఎంత మంచోడో అనుకునేరు.. కాసేపటికి..
వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఎల్‌పీజీ సరఫరాపై కీలక ప్రకటన!
వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఎల్‌పీజీ సరఫరాపై కీలక ప్రకటన!
పదోతరగతి పరీక్షలు రాసేందుకు ఈ దివ్యాంగురాలి కష్టాలు చూశారా? VIDEO
పదోతరగతి పరీక్షలు రాసేందుకు ఈ దివ్యాంగురాలి కష్టాలు చూశారా? VIDEO
ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది,రంజాన్‌కు ప్రత్యేక బస్సులు
ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది,రంజాన్‌కు ప్రత్యేక బస్సులు
రమణ మహర్షి ఆశ్రమంలో అద్భుతం కళ్లారా చూశా: నటుడు కృష్ణ భగవాన్
రమణ మహర్షి ఆశ్రమంలో అద్భుతం కళ్లారా చూశా: నటుడు కృష్ణ భగవాన్
బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?
బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?