Bigg Boss 6 Final: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అతనే.. మరోసారి లీకైన విజేత.. ఎట్టకేలకు సెస్పెన్స్‏కు తెర..

ముందు నుంచి లీక్ అవుతున్నట్లుగా ఇప్పుడు కూడా మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి. శుక్రవారం అర్ధరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కాగా... సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తోంది. అలాగే టాప్ 4

Bigg Boss 6 Final: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అతనే.. మరోసారి లీకైన విజేత.. ఎట్టకేలకు సెస్పెన్స్‏కు తెర..
Bigg Boss 6
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 18, 2022 | 6:34 AM

మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ సీజన్ 6కు ఎండ్ కార్డ్ పడనుంది. 21 మందితో మొదలైన ఈ షోలో.. చివరకు 5గురు ఫైనలిస్ట్ లు మిగిలారు. ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, రోహిత్, కీర్తి టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచారు. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఫైనల్ కు ఒక రోజు ముందే శ్రీసత్యకు బయటకు పంపి షాకిచ్చారు బిగ్ బాస్. అయితే ఎప్పుడూ ఉన్నట్లు.. ఈ సీజన్ విన్నర్ ఎవరనేదానిపై మాత్రం ప్రేక్షకులలో ఎలాంటి ఉత్కంఠ లేదు. ఎందుకంటే.. సీజన్ విన్నర్.. రేవంత్ అంటూ షో మొదటి నుంచి వినిపిస్తున్నదే.  ఈసారి ఇంట్లోకి వచ్చిన సభ్యులలో అత్యంత ఎక్కువ పాపులారిటీ ఉన్నది అతనికి మాత్రమే. కానీ కొన్నిసార్లు బయట ఎంత క్రేజ్ ఉన్నా.. ఇంట్లోకి వచ్చాక వాళ్ల ఆట తీరు.. ప్రవర్తన ఆధారంగా ఓటింగ్ పెరగవచ్చు ..తగ్గిపోవచ్చు. కానీ ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎవరూ కూడా అంతగా ఆట పై ఫోకస్ పెట్టలేదు. వెకేషన్‏కు తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకుంటూ.. బ్యా్క్ బిచింగ్ చేస్తూ ఎంతో సరదాగా గడిపేశారు.

ఫిజికల్ టాస్కులలో మాత్రమే కాదు.. చివరకు ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చి ప్రేక్షకులకు కాస్త వినోదాన్ని పంచండి అని చెప్పగా.. చివరకు బిగ్ బాస్ తో గేమ్ ఆడండి అంటూ వార్నింగ్ కూడా తీసుకున్నారంటే ఈసారి షో ఎంత అట్టర్ ప్లాప్ అనేది అర్థమవుతుంది. ఇక అన్ ఫెయిర్ ఎలిమేషన్స్ తో ప్రేక్షకుల నుంచి ఎక్కువగా నెగిటివిటీ వచ్చేసింది. ముఖ్యంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న ఇనయ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ టీఆర్పీ దెబ్బకు పడిపోయింది. ఇక ఇప్పుడు ఫైనల్ కు మరికొద్ది గంటల సమయం మాత్రమే.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో ముందు నుంచి లీక్ అవుతున్నట్లుగా ఇప్పుడు కూడా మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి. శుక్రవారం అర్ధరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కాగా… సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తోంది. అలాగే టాప్ 4 ప్లేస్ కీర్తి.. టాప్ 3లో ఆదిరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సీజన్ 6 రన్నరప్ గా శ్రీహాన్.. విజేత గా రేవంత్ ఉన్నట్లు నెట్టింట న్యూస్ వైరలవుతుంది. ప్రస్తుతం ఉన్న ఈ ఐదుగురిలో రేవంత్ కు అత్యధిక ఓట్లు వచ్చాయని.. దీంతో విన్నర్ అయ్యారని.. ఇక టాప్ 2 స్థానంలో శ్రీహాన్ నిలిచినట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలలో నిజమెంత తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. మరోవైపు బిగ్ బాస్ ఇంట్లో ఫైనల్ సంబరాలు మొదలయ్యాయి. మాజీ ఇంటిసభ్యులు.. గ్రూపులుగా వచ్చి సందడి చేస్తున్నారు.