- Telugu News Photo Gallery Cinema photos Bigg boss 6 sri satya remuneration in bigg boss telugu cinemanews
Bigg Boss 6: ఫైనల్కు ఒక్కరోజు ముందే శ్రీసత్య ఔట్.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ?..
బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు ఒక్కరోజు ముందే శ్రీసత్య ఎలిమినేట్ అయ్యింది. టాప్ 6లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ అసలు ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆఖరుకు శ్రీసత్యను ఇంటి నుంచి బయటకు పంపించారు.
Updated on: Dec 17, 2022 | 9:30 PM

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు ఒక్కరోజు ముందే శ్రీసత్య ఎలిమినేట్ అయ్యింది. టాప్ 6లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ అసలు ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆఖరుకు శ్రీసత్యను ఇంటి నుంచి బయటకు పంపించారు.

అయితే శ్రీసత్య పై ముందు నుంచే ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. కారణం మొదటివారమే తాను కేవలం డబ్బు కోసమే వచ్చానని.. గేమ్ ఆడేందుకు కాదని చెప్పడంతో ఆమెపై పూర్తి నెగిటివిటి వచ్చేసింది.

మొదటి వారంలో ఆమె బిహేవియర్ పై నాగ్ సైతం సీరియస్ అయ్యారు. అయితే రెండవ వారం శ్రీసత్య ఆట తీరులో మార్పు రావడంతో ఆమె పై పాజిటివిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇక మెల్లి మెల్లిగా తన ఆట తీరుకుంటూ మార్చుకుంటూ వచ్చిన శ్రీసత్య.. కీర్తి విషయంలో మాత్రం ప్రతిసారి తప్పు చేస్తూ దొరికిపోయింది. కీర్తి మాట్లాడుతుంటే వెక్కిరింపుగా నవ్వడం... బ్యాక్ బిచింగ్ చేయడంతో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది.

ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత తన తండ్రి మాటలను దృష్టిలో పెట్టుకుని వెటకారం..బ్యాక్ బిచింగ్ తగ్గించేసింది. ఇక టాప్ 5లో ఉంటాననుకున్న శ్రీసత్యకు షాకిచ్చాడు బిగ్ బాస్.

మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ శ్రీసత్యను ఇంటి నుంచి బయటకు పంపించేసాడు. ఇక 15 వారాలు ఇంట్లో ఉన్నందుకు ఆమెకు భారీగానే రెమ్యూనరేషన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు రూ. 15 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.





























