Year Ender 2022: అలియా టు హన్సిక.. ఈ ఏడాది అత్యంత స్టైలిష్ అండ్ అందమైన వధువులు వీరే
2022 చాలా మంది నటీమణులకు ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ సంవత్సరంలోనే వారు వివాహం అనే జీవితంలో మరో కొత్త అధ్యాయంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో 2022లో అత్యంత స్టైలిష్ వధువులుగా వార్తల్లో నిలిచిన తారలెవరో తెలుసుకుందాం రండి.
Nayanatara, Hansika
Follow us
2022 చాలా మంది నటీమణులకు ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ సంవత్సరంలోనే వారు వివాహం అనే జీవితంలో మరో కొత్త అధ్యాయంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో 2022లో అత్యంత స్టైలిష్ వధువులుగా వార్తల్లో నిలిచిన తారలెవరో తెలుసుకుందాం రండి.
అలియా భట్, రణబీర్ కపూర్ వివాహం 2022 సంవత్సరంలో అతిపెద్ద ఈవెంట్. ఈ పెళ్లిలో అత్యంత స్టైలిష్ గా కనిపించింది అలియా. తన పెళ్లి రోజున సబ్యసాచి లేబుల్లోని ఐవరీ గోల్డ్ చీరను ఆమె ధరించింది. ఇందులో బ్లౌజ్‌పై ఎంబ్రాయిడరీ వర్క్ లుక్కు మరింత శోభను చేకూర్చింది.
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ ఈ ఏడాది తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో పెళ్లిపీటలెక్కింది. ఈ వెడ్డింగ్ ఈవెంట్లో నయనతార ధరించిన అవుట్ ఫిట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
హన్సిక మోత్వానీ డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. నటి తన పెళ్లి రోజున రింపుల్, హర్‌ప్రీత్ నరులా డిజైన్ చేసిన లెహెంగాను ధరించింది. ఎరుపు రంగు లెహంగాపై మెడలో ఉన్న నెక్లెస్ హన్సిక లుక్‌ని మరింత అందంగా మార్చింది.
ప్రముఖ బాలీవుడ్ నటి మౌని రాయ్ దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను జనవరి 27న గోవాలో వివాహం చేసుకుంది. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన మౌని రాయ్ బ్రహ్మస్త్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.