- Telugu News Photo Gallery Cinema photos Trisha completed 20 years in cinema industry and upcoming movies updates Telugu actors Photos
Trisha Krishnan: గ్రాండ్ సెలబ్రేషన్స్‌లో చెన్నై చంద్రం.. వారెవ్వా.. త్రిష ఇంత గ్రేస్‌తో ఉన్నారేంటి..?
తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష ది ప్రత్యేక స్థానం. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ చెన్నై సుందరి... అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Dec 17, 2022 | 7:12 PM

ట్వంటీ అనే నెంబర్ సినిమాల పరంగా హీరోలకు పెద్ద విషయమేమో కానీ, హీరోయిన్లు అలవోకగా లాగించేసే విషయం. బట్, ట్వంటీ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ అనేది హీరోలకు నల్లేరు మీద నడక కావచ్చు. కానీ హీరోయిన్లకు కాదు.... సినిమా రంగంలో అడుగుపెట్టి 20 ఏళ్లయినా, అదే గ్రేస్‌తో హీరోయిన్‌గా కంటిన్యూ కావడమంటే మాటలు కాదు. గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకుని తీరాల్సిందే. ఇప్పుడు అదే మూడ్‌లో ఉన్నారు చెన్నై సుందరి త్రిష

రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్లలో త్రిషను చూసిన వారు, వారెవ్వా.. త్రిష ఇంత గ్రేస్‌తో ఉన్నారేంటి? అందరికీ వయసు పెరుగుతుంటే, ఈమెకు మాత్రం ఏజ్ తగ్గుతుందా? అని అనుకున్నారు. ఆ మాటను ఆమెతోనే అంటే, సరదాగా నవ్వేసి ఊరుకున్నారు బ్యూటీ.

నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లయిందోచ్ అని త్రిష ఫొటో పెడితే, వావ్... అప్పటికీ, ఇప్పటికీ అదే అందం, ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? మాకు టిప్స్ చెప్పండి అనే రిక్వస్టులే ఎక్కువగా వస్తున్నాయట త్రిషకు. మనసు హాయిగా ఉంటే, మనం హాయిగా ఉంటాం. అంతకు మించిన అందం ఇంకేం ఉంటుంది అని అంటున్నారు త్రిష.

పొన్నియిన్ సెల్వన్2 పనులతో బిజీగా ఉన్నారు చెన్నై సుందరి. ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ డైరక్షన్‌లో విజయ్‌తో జోడీ కట్టనున్నారు. ఆల్రెడీ కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు త్రిష. అయితే అప్పట్లో ఇక బాలీవుడ్ ప్రాజెక్టులు వద్దనుకున్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ బాలీవుడ్ మీద ఫోకస్ చేసే అవకాశాలున్నాయనే మాటలూ వినిపిస్తున్నాయి.

నెక్స్ట్ ఇయర్ త్రిషకు మలయాళంలో మోహన్‌లాల్ పక్కన నటించే రామ్ విడుదలవుతుంది. తమిళంలో పొన్నియిన్ సెల్వన్, విజయ్‌మూవీతో పాటు గర్జనై, చతురంగ వేట్టై, రాంగీ సినిమాలు రిలీజ్ అవుతాయి. తన రెండు దశాబ్దాల ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ తన అభిమానులను త్రిషయర్స్ అని త్రిష పిలిచిన తీరుకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.




