Brahmamudi, September 21st Episode: కంపెనీ పతనానికి స్కెచ్ సిద్ధం చేసిన అనామిక.. బెదిరిన రాజ్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్, అప్పూలను తక్కవు చేసి మాట్లాడుతుంది అనామిక. అయినా ఎక్కడా తగ్గకుండా అప్పూ వార్నింగ్ ఇస్తుంది. ఇదిగో నువ్వు ఇప్పటి నుంచే జాగ్రత్త పడకపోతే.. దీని కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ బతకాలి జాగ్రత్త.. ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలని అంటుంది అప్పూ. మరోవైపు శాంతాతో వంట చేయించాలని ఫిక్స్ అవుతాడు రాజ్. కిందకి దిగి.. ఈ రోజు నుంచి ఇంట్లో శాంతానే వంట చేస్తుందని అంటాడు. అది విన్న ఇంట్లోని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకు ఇంత బలమైన నిర్ణయం తీసుకున్నావ్? రాజ్..

Brahmamudi, September 21st Episode: కంపెనీ పతనానికి స్కెచ్ సిద్ధం చేసిన అనామిక.. బెదిరిన రాజ్!
BrahmamudiImage Credit source: disney hot star
Follow us
Chinni Enni

|

Updated on: Sep 21, 2024 | 12:45 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్, అప్పూలను తక్కవు చేసి మాట్లాడుతుంది అనామిక. అయినా ఎక్కడా తగ్గకుండా అప్పూ వార్నింగ్ ఇస్తుంది. ఇదిగో నువ్వు ఇప్పటి నుంచే జాగ్రత్త పడకపోతే.. దీని కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ బతకాలి జాగ్రత్త.. ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలని అంటుంది అప్పూ. మరోవైపు శాంతాతో వంట చేయించాలని ఫిక్స్ అవుతాడు రాజ్. కిందకి దిగి.. ఈ రోజు నుంచి ఇంట్లో శాంతానే వంట చేస్తుందని అంటాడు. అది విన్న ఇంట్లోని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకు ఇంత బలమైన నిర్ణయం తీసుకున్నావ్? రాజ్.. శాంతా వంట చేస్తే.. ఖచ్చితంగా ఆస్పత్రికి వెళ్లక తప్పదురా అని అంటారు. మీకు శాంతా వంట గురించి తెలియక మాట్లాడుతున్నారు. ఒక్కసారి రుచి చూశారంటే అస్సలు వదిలి పెట్టరని అంటాడు రాజ్. ఎందుకు రా ఇంత పంతం నీకు అని ఇందిరా దేవి అంటే.. పాత వ్యవస్థ పోవాలని చెబుతాడు రాజ్.

శాంతా వంట.. కంగారులో దుగ్గిరాల ఫ్యామిలీ..

సరే నాకేం అభ్యంతరం లేదు కానీ.. శాంత వంట చేశాక.. ముందు మా అత్తకు పెట్టాలి. ఆవిడ బాగానే ఉంటే ఆ తర్వాత మేము తింటామని స్వప్న అంటుంది. దీంతో రుద్రాణి కంగారు పడుతుంది. నువ్వేం కంగారు పడకు అత్తా.. శాంతా చేసిన వంట ముందుగానే నేనే తింటానని చెప్తాడు రాజ్. అన్నయ్యా వీడికి ఏమైంది? ఎందుకు ఇంత సాహసం చేస్తున్నాడు అంటూ ప్రకాశం చాలా కంగారు పడుతూ ఉంటాడు. చేయనీరా.. ఎవరి చేతి వంట ఎలా ఉంటుందో అప్పుడన్నా తెలుస్తుందని సుభాష్ అంటాడు. డాడీ మీకెవరికీ తెలీదు.. శాంతాలో ఓ నలుడు.. ఓ భీముడు.. ఓ వంటగత్తె.. అని రాజ్ బిరుదులు ఇస్తాడు. సరే వెళ్లు.. నువ్వే వెళ్లి వండి తీసుకురా.. తిన్నాక వాడు ఎలా ఉంటాడో ఇప్పుడు చూద్దామని అపర్ణ అంటుంది. థాంక్స్ బాబుగారూ.. వంటలు కుమ్మేస్తానని ఎంతో సంతోష పడుతుంది శాంతా.

కృష్ణ మూర్తికి కావ్య సహాయం..

మరోవైపు కృష్ణమూర్తి మట్టి పిసుకుతూ ఉంటాడు. కావ్య బయటకు వచ్చి.. వినాయక చవితికి విగ్రహాలు ఆర్డర్ వచ్చాయా అని అడుగుతుంది. వచ్చాయి అమ్మా.. పెద్దగా ఆర్డర్లు తీసుకోలేదు.. నా వల్ల చేతనైనతే తీసుకున్నానని కృష్ణమూర్తి అంటాడు. సరే ఉండండి నేను కూడా మీకు సహాయం చేస్తానని కావ్య కూడా చేస్తుంది. నీకు ఎందుకు అమ్మా.. అని కృష్ణమూర్తి అన్నా కావ్య చేస్తుంది. అప్పుడే కనకం వచ్చి.. చాలా సంతోషంగా ఉంది. కూతురు అత్తారింట్లో కాపురం చేసుకోకుండా.. పుట్టింటికి వచ్చి మట్టి పిసికితే ఎలా ఉంటుంది. అయినా వాళ్లను కాదు.. నిన్ను అనాలని కనకం అంటుంది. నువ్వే నా మాట వినడం లేదు.. ఇక వాళ్లేం వింటారని కృష్ణమూర్తి అంటాడు. ఇక తన తండ్రికి సపోర్ట్ చేస్తుంది కావ్య. ఆ తర్వాత నేను అల్లుడి గారి ఇంటికి వెళ్తున్నా.. వియ్యంకురాలు ఆస్పత్రి నుంచి వచ్చింది కదా.. వెళ్లి పలకరించి వస్తానని కనకం అంటుంది. దీంతో కావ్య ఆలోచనలో పడుతుంది.

ఇవి కూడా చదవండి

నవ్వలేక చచ్చిపోతారు.. రాజ్‌కు అపర్ణ చివాట్లు..

మరోవైపు.. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటారు. రాజ్ శాంతా వంటలను తెగ పొగుడుతూ ఉంటాడు. మరోవైపు ప్రకాశం కంగారు పడుతూ ఉంటారు. అందరికీ వడ్డించమని రాజ్ అంటే.. మా వదిన పాపం.. వద్దమ్మా మా ధాన్య లక్ష్మికి వడ్డించమని అంటాడు ప్రకాశం. ఇలా అందరూ మాకు వద్దు.. మాకు వద్దు అంటూ ఉంటే.. అప్పుడే రాజ్ ఎవరికీ వద్దు.. నాకే పెట్టమని రాజ్ అంటాడు. ఇక ఆత్రంగా రాజ్ భోజనం కలిపి నోట్లో ఒక్క ముద్ద పెట్టగానే.. ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. దీంతో అందరూ కంగారు పడిపోతారు. రాజ్ ఒక్కసారిగా కారం కారం అంటూ ఉంటాడు. వెంటనే నీళ్లు తాగుతాడు. ఏ శాంతా ఆప్పుడు అంత అద్భుతంగా చేశావు.. ఈ రోజు ఇలా చేశావు ఏంటి? అని రాజ్ అంటే.. అప్పుడు వంట చేసింది శాంతా కాదు.. నీ భార్య కళావతి అని అపర్ణ అంటుంది. నేను ఈ కూర బాలేదని చెప్పలేదు కదా అమ్మా.. కొంచెం కారంగా ఉందని రాజ్ అంటాడు. తిను బాగా తిను.. ఏడాది నుంచి ఇక్కడ అందరూ తృప్తిగా భోజనం చేశారని అందుకు కారణం నీ భార్య. నీలో ఇంకా అహంకార తగ్గలేదు. ఎక్కువ కాలం చూడటం కూడా కుదరదు. ఆ తర్వాత నేను తీసుకునే నిర్ణయం ఏంటో మీకు తెలీదు.

ఆ చరిత్రకు చెదలు పట్టింది..

ఆ తర్వాత అనామిక, సామంత్‌లు కలిసి ఆఫీస్‌కి వస్తారు. అనామికను తీసుకొచ్చి బాస్ సీటులో కూర్చోబెడతాడు సామంత్. ఎంతో ఆనందంగా నిన్ను ఇలా చూస్తుంటే ఇంకా నమ్మలేక పోతున్నా.. కాలేజీలో ఎన్ని సార్లు ప్రపోజ్ చేసినా నువ్వు పట్టించుకోలేదు కదా.. కానీ ఇప్పుడు నిన్ను నా ఛాంబర్‌లో చూస్తుంటే కలలా ఉందని అంటాడు. మనిద్దరం కలిస్తే ఇప్పుడు ఎన్నో మిరాకల్స్ చూడవచ్చని అనామిక అంటే.. వందేళ్ల చరిత్ర ఉన్న స్వరాజ్ కంపెనీని కొట్టే సంస్థ ఇన్ని సంవత్సరాల్లో పుట్టలేదని సామంత్ అంటాడు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు.. ఇప్పుడు ఆ చరిత్రకు చదలు పట్టింది. కావ్య కూడా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇదే అవకాశంతో మనం దుగ్గిరాల ఫ్యామిలీని కిందకు దించేయవచ్చని అనామిక అంటుంది.

కావ్య చేతనే దుగ్గిరాల కంపెనీకి చెక్ పెట్టబోతున్న అనామిక..

అది అస్సలు కుదరదు. కావ్య మాత్రమే వందేళ్ల చరిత్ర క్రియేట్ కాలేదు కదా అని అంటాడు సామంత్. ఇప్పుడు అందరూ ట్రెండీగా ట్రెడిషన్‌గా ఉండే జ్యువెలరీ కోరుకుంటున్నారు. అలాంటివి ఈ పోటీ ప్రపంచంలో చాలా అవసరం. కాబట్టి ఆ కావ్యని మన వైపుకు తిప్పుకోవాలి. కావ్య పుట్టిల్లు అంత రిచ్ కాదు. ఆ అవసరాన్ని మనకు అవకాశంగా మార్చుకోవాలి. ఇదిగో ఆ సందీప్.. ఇంతకు ముందు కావ్య డిజైన్స్‌ని కంపెనీకి అమ్మేవాడు. ఇప్పుడు వీడితోనే ఆ కావ్య డిజైన్స్ మనకు వచ్చేలా చేయాలని చెబుతుంది అనామిక. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..