Hyper Aadi: వరద బాధితులకు జబర్దస్త్ హైపర్ ఆది విరాళం.. పవన్ కల్యాణ్‌కు చెక్ అందజేత.. ఎన్ని లక్షలు ఇచ్చాడంటే?
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వరద బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పలువురు సినీ తారలు ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు విరాళం అందజేశారు. తాజాగా జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది వరద బాధితులకు తన వంతు విరాళం అందించాడు. ఈ మేరకు శనివారం (సెప్టెంబర్ 21)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయ వాడ ప్రాంతాలు వరదల్లో నీట మునిగాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇరు ప్రభుత్వాలు భారీగా నష్ట పరిహారాన్ని ప్రకటించాయి. అదే సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వరద బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పలువురు సినీ తారలు ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు విరాళం అందజేశారు. తాజాగా జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది వరద బాధితులకు తన వంతు విరాళం అందించాడు. ఈ మేరకు శనివారం (సెప్టెంబర్ 21)రూ. 3 లక్షల విరాళం చెక్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు స్వయంగా అందజేశాడు హైపర్ ఆది. తాను ఇచ్చిన ఈ మూడు లక్షల్లో వరద పీడిత గ్రామమైన ఏకే మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) కు రూ. 1లక్ష ఇవ్వాలని, మిగతా రెండు లక్షలు తన సొంత గ్రామం పల్లాపల్లి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని ఆది పవన్ కల్యాణ్ ను కోరారు.
‘వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు రూ. 6కోట్ల విరాళం ఇచ్చి పవన్ కల్యాణ్ అందిరిలో స్ఫూర్తి నింపారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేను రూ. 3 లక్షల విరాళం ఇచ్చాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. ఓవైపు టీవీ షోల్లోనూ, మరోవైపు వెండితెరపై మెరుస్తోన్న హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఈ కారణంతోనే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున విస్తృత ప్రచారం నిర్వహించాడీ స్టార్ కమెడియన్. కేవలం పిఠాపురంలో మాత్రమే కాకుండా జనసేన అభ్యర్థులు పోటీ చేసిన పలు చోట్ల ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించాడు. ఈ కారణంగానే ఆ మధ్యన జనసేన తరఫున ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని లేకపోతే ఏదో ఒక కార్ఫొరేషన్ ఛైర్మన్ పదవి బాధ్యతలు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే హైపర్ ఆది వీటిని ఖండించాడు.
పవన్ కల్యాణ్ కు చెక్ అందజేస్తోన్న హైపర్ ఆది..
ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ
•అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ రూ.67,29,398
•రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ దంపతులు రూ.25 లక్షలు
వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి… pic.twitter.com/bpTRHMM3iM
— JanaSena Party (@JanaSenaParty) September 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.