Bigg Boss 8 Telugu: ఓటింగ్ ఉల్టా పుల్టా.. అనూహ్యంగా డేంజర్‌జోన్‌లోకి ఆ స్ట్రాంగ్ లేడీ .. ఎలిమినేట్ ఎవరంటే?

మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు వెళ్లిపోగా, రెండో వారం శేఖర్ బాషా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. ఓట్లలో ఆధిక్యం ఉన్నప్పటికీ అతను ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మూడో వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 8 Telugu: ఓటింగ్ ఉల్టా పుల్టా.. అనూహ్యంగా డేంజర్‌జోన్‌లోకి ఆ స్ట్రాంగ్ లేడీ .. ఎలిమినేట్ ఎవరంటే?
Bigg Boss 8 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Sep 21, 2024 | 11:01 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడో వారం ఆఖరికి వచ్చేసింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు వెళ్లిపోగా, రెండో వారం శేఖర్ బాషా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. ఓట్లలో ఆధిక్యం ఉన్నప్పటికీ అతను ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మూడో వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. ఎలిమినేషన్ కు సంబంధించి మూడో వారం నామినేషన్స్ లో ), విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, యష్మీ గౌడ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ, నైనికలు నామినేట్ అయ్యారు. అయితే మరో కంటెస్టెంట్ అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేషన్ తో ఈ జాబితాలోకి చేరాడు. ఇప్పుడిదే అతని కొంప ముంచేటట్లు ఉంది. శుక్రవారం (సెప్టెంబర్ 21) బిగ్ బాస్ థర్డ్ వీక్ నామినేషన్స్ కు సంబంధించి ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. గత రెండు వారాల్లాగే మూడో వారం ఓటింగ్ లోనూ ఓటింగ్‌లోనూ విష్ణుప్రియ భీమనేనిదే ఆధిపత్యం. ఆ తర్వాత సింపతీ స్టార్ నాగ మణికంఠ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక నైనిక మూడో స్థానంలో ఉండగా.. డేంజర్ జోన్ లో ఉన్న కిర్రాక్ సీత అనూహ్యంగా నాలుగో ప్లేస్ లోకి వచ్చింది. ప్రేరణ ఐదో స్థానంలో ఉండగా.. ఊహించలేని విధంగా యష్మీ గౌడ ఆరో స్థానంలోకి వచ్చేసింది. ఇక అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఆఖరి ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. అంటే ప్రస్తుతం యష్మీ, పృథ్వీరాజ్, అభయ్ నవీన్ డేంజర్ జోన్ లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఓటింగ్ లో ఆఖరి స్థానంలో అభయ్ నవీన్..

అయితే యష్మీ, పృథ్వీలు టాస్కుల్లో పోటాపోటీగా తలపడుతున్నారు. ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. కాబట్టి వీరిని బయటకు పంపించే అవకాశం లేదు. కాబట్టి అభయ్ నవీన్ ఈ వారం సూట్ కేస్ సర్దుకునే ఛాన్స్ ఉంది.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.