Brahmamudi, July 30th Episode: రుద్రాణి ఫిటింగ్.. అప్పూ, కళ్యాణ్‌ల పెళ్లికి రాజ్ కష్టాలు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నాకు నువ్వు ఇచ్చిన మాట ఇచ్చిన సంగతి ఏంటి? అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. మధ్యలో రుద్రాణి మరిన్ని చిచ్చులు పెడుతుంది. దీంతో రుద్రాణిని స్వప్న తిడుతుంది. ఇక అప్పుడే స్వప్నని రాహుల్ మందలిస్తాడు. మీ అమ్మగారు చూసిన సంబంధం మీరు చేసుకుంటేనే ఈ నోళ్లు అనేవి మూతపడతాయని కావ్య అంటుంది. చూస్తావేంటిరా ఒప్పేసుకో.. వెళ్లు మాట ఇవ్వు అని రాజ్ అంటాడు. నేను ఇప్పుడు ఇంకో పెళ్లికి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నాకు నువ్వు ఇచ్చిన మాట ఇచ్చిన సంగతి ఏంటి? అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. మధ్యలో రుద్రాణి మరిన్ని చిచ్చులు పెడుతుంది. దీంతో రుద్రాణిని స్వప్న తిడుతుంది. ఇక అప్పుడే స్వప్నని రాహుల్ మందలిస్తాడు. మీ అమ్మగారు చూసిన సంబంధం మీరు చేసుకుంటేనే ఈ నోళ్లు అనేవి మూతపడతాయని కావ్య అంటుంది. చూస్తావేంటిరా ఒప్పేసుకో.. వెళ్లు మాట ఇవ్వు అని రాజ్ అంటాడు. నేను ఇప్పుడు ఇంకో పెళ్లికి సిద్ధంగా లేను. నా మనసు అంతా అల్లకల్లోలంగా ఉంది. అనామిక చేసిన గాయం మానక ముందే నేను మళ్లీ ఇంకో పెళ్లికి సిద్ధంగా లేను అని చెప్పి కళ్యాణ్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఎవరికి వారు అందరూ వెళ్లిపోతారు. బెడ్ రూమ్‌కి వెల్లిన కళ్యాణ్.. బాధ పడుతూ ఆలోచిస్తాడు.
తను పెళ్లి చేసుకున్నా ఈ ఇంటికి వచ్చి బాధ పడాల్సిందే..
అప్పుడే రాజ్ వచ్చి.. ఏంట్రా నువ్వు చేసిన పని.. అంత మంది ముందు నువ్వు పడుతున్న బాధ బయట పెడితే.. సింపుల్‌గా అబద్ధం చెప్తావా? నీ ప్రేమను గెలిపించుకునే ధైర్యం కూడా నీకు లేదా? ఎందుకు ఇలా ఒంటరిగా బాధ పడటం. అసలు ఎందుకు అప్పూని దూరం పెడుతున్నావో ఒక్క కారణం చెప్పు అని రాజ్ అడుగుతాడు. ఒక్కటి కాదు అన్నయ్యా.. చాలా ఉన్నాయి. నీతో మాట్లాడి వెళ్లిన తర్వాత అప్పూని కలిశాను. ఆ పెళ్లి చేసుకోవడం అప్పూకి ఇష్టమే అని చెప్పింది. ఇంకెందుకు నేను మాట్లాడి ప్రయోజనం ఉందని మాట్లాడలేదు. పైగా వదిన చెప్పింది కూడా నిజమే. అప్పూ అంటే ఇంట్లో ఎవరికీ నచ్చదు. తనని పెళ్లి చేసుకుని బాధ పెట్టే కంటే.. తను ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకోవడం మంచిదని కళ్యాణ్ అంటాడు.
నీ వల్లే కళ్యాణ్ తన మనసులో మాట చెప్పడం లేదు..
నిన్న అనవసరంగా కళావతి భయ పెట్టింది. నీకు నేను ఉన్నాను కదా.. చూసుకుంటాను అని రాజ్ అంటాడు. నేను చాలా దురదృష్ట వంతుడిని.. మాకు రాసి పెట్టి లేదు. వదిలేయ్ అన్నయ్యా అని కళ్యాణ్ వెళ్తాడు. దీంతో కోపంగా రాజ్.. కావ్య దగ్గరికి వెళ్తాడు. కళ్యాణ్ మనసులో అప్పూ మీద ప్రేమ ఉందని నీకు తెలీదా? అని అడుగుతాడు. అప్పుడు రుద్రాణి వచ్చి చాటుగా వింటుంది. అప్పూ ఈ పెళ్లి ఒప్పుకుని ఈ ఇంటికి వస్తే.. మా పిన్ని, మంథర లాంటి రుద్రాణి అత్త వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పావ్ అని రాజ్ అంటే.. నేనేం భయ పెట్టలేదు. అందరి ముందూ కవి గారు అప్పూని ప్రేమించడం లేదని చెప్పారు కదా.. ఇంకేంటి? అని కావ్య అంటుంది. అప్పూ మనసులో, కళ్యాణ్ మనసులో ఏముందో నీకూ నాకూ.. అప్పూ, కళ్యాణ్‌కి కూడా తెలుసు. నీ వల్లే కళ్యాణ్ తన మనసులో మాట బయట పెట్టడానికి ఆలోచిస్తున్నాడని రాజ్ అంటాడు. దీంతో కావ్య సీరియస్ అవుతూ.. అందరికీ నేనొక ఆట బొమ్మలా కనిపిస్తున్నానా? నేనేం చేస్తాను? ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటే మంచిదని అనుకుంటున్నాం. ఇందులో ఎవర్నీ చేసేది ఏమీ లేదు. నన్ను ఎరైనా అంటే బాగోదని కావ్య అంటుంది.
వాళ్లు ఒప్పుకుంటే నేనే పెళ్లి చేస్తాను..
వాడు నోరు విప్పి చెప్పకపోయినా.. వాడి ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలుసని రాజ్ అంటాడు. మరి అప్పూ కవిగారిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పిందా? అని కావ్య అడిగితే.. నేను అప్పూతో మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకుంటుందని రాజ్ అంటాడు. సరే అయితే తెలుసుకుని రండి. నిజంగా ఇద్దరూ కోరుకుంటే.. ఎవరి మాటలూ లెక్క చేయకుండా.. వాళ్ల పెళ్లి నేను మీతో పాటు దగ్గరుండి చేపిస్తానని అంటుంది కావ్య. సరే నేను వెళ్లి అప్పూని ఒప్పించి తీసుకొస్తాను. నువ్వు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉండమని రాజ్ అని వెళ్తాడు.
మందర రుద్రాణి.. చెడగొట్టేసిందిగా..
కట్ చేస్తే.. వీళ్ల మాటలు విన్న రుద్రాణి వెంటనే కనకానికి ఫోన్ చేస్తుంది. కావాలనే రెచ్చ గొడుతుంది. రుద్రాణి ఫోన్ ఎత్తిన కనకం.. హలో అంటుంది. మొత్తానికి నువ్వు అనుకున్నంత పని చేశావు. అనుకున్నది సాధించావు. దేని గురించి మాట్లాడుతున్నారు.. నాకేం అర్థం కావడం లేదని కనకం అంటుంది. నీకు అన్నీ తెలిసినా ఏం తెలీనట్టు మాట్లాడుతున్నావా? అప్పూని కళ్యాణ్‌కి ఇచ్చి పెళ్లి చేయాలన్న నీ ఆలోచన వర్కౌట్ అయ్యిందని చెబుతున్నా. స్వయంగా రాజే వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని డిసైడ్ చేశాడు. ఇప్పుడు రాజే మీ ఇంటికి వచ్చేలా చేశావ్ చూడు. నీ పాదాలకు పాదాభివందనం చేస్తున్నాను. ఎవరు ఎన్ని చెప్పినా.. ఏం చేసినా.. అప్పూకి నచ్చిన అబ్బాయితోనే పెళ్లి చేస్తాను. దాన్ని ఎవ్వరూ మార్చలేరని కనకం అంటుంది. మీ అల్లుడి మాటను ఎదిరించి అప్పూకి పెళ్లి చేయగలవా అని రుద్రాణి సూటిపోటి మాటలు మాట్లాడుతుంది. అప్పూకి నేను అనుకున్న వాడితోనే పెళ్లి జరుగుతుందని కనకం అంటుంది. హమ్మయ్య కనకానికి కోపం తెప్పించాను. ఇప్పుడు రాజ్ ఎన్ని చెప్పినా అప్పూని కళ్యాణ్‌కి ఇచ్చి పెళ్లి చేయదని అనుకుంటుంది రుద్రాణి.
కళ్యాణ్.. అప్పూని ప్రేమిస్తున్నాడు..
ఆ తర్వాత రాజ్ కనకం వాళ్ల ఇంటికి వస్తాడు. నేను మీతో మాట్లాడటానికి వచ్చాను అని రాజ్ అంటే.. దేని గురించి అని కృష్ణమూర్తి అడుగుతాడు. అప్పూ గురించి అని రాజ్ అంటాడు. అక్కడే గదిలో ఉన్న అప్పనూ.. రాజ్ మాటలు అన్నీ వింటుంది. కళ్యాణ్.. అప్పూని ప్రేమిస్తున్నాడని చెప్తాడు రాజ్. దీంతో అందరూ షాక్ అవుతారు. అప్పూ మొదటి నుంచీ కళ్యాణ్‌ని ప్రేమించిన విషయం నాకు తెలుసు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు మీరు దేనికి భయ పడి అప్పూకి మరో పెళ్లి చేస్తున్నారని రాజ్ అంటాడు. అప్పూకి వేరే వ్యక్తితో సంబంధం కుదిరింది. అన్నీ తెలిసే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడ్డాడు. ఇప్పుడు మీరు వచ్చి సంబంధం అడగటం పద్దతి కాదు. అప్పూ కూడా ఈ పెళ్లిని ఇష్ట పడుతుందని కనకం అంటుంది.
నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నా..
మీరు నాతో మాట్లాడే విధానం చూస్తూనే అర్థం అవుతుంది. అప్పూని పెళ్లికి బలవంతంగా అప్పగించారని రాజ్ అంటాడు. మీరు కావాలంటే అప్పూనే అడగవచ్చు. అప్పూ అని పిలుస్తుంది కనకం. కన్నీళ్లు తుడుచుకుని బయటకు వస్తుంది అప్పూ. ఏంటి బావా నిలబడే మాట్లాడుతున్నావ్? అని అడుగుతుంది. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అప్పూ.. లేక బలవంతంగా ఎవరైనా ఒప్పించారా అని అంటాడు రాజ్. లేదు బావా.. నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుందని అప్పూ అంటుంది. ఎందుకు మీరు మా పిన్నికి, రుద్రాణికి భయ పడే కదా వద్దు అంటున్నారు. అంతా నేను చూసుకుంటానని రాజ్ అంటాడు.
ఒప్పుకోని కనకం.. ఆవేశంలో రాజ్..
అయినా కనకం ఒప్పుకోదు. మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుందని చెబుతుంది. ఇప్పటికే నా ఇద్దరు కూతుళ్లు ఆ ఇంట్లో పడుతున్న మాటలు చాలు. ఇప్పుడే వాళ్ల కాపురాలు బాగున్నాయి. మళ్లీ ఇప్పుడు అప్పూని ఆ ఇంటికి పంపించి.. దాని కాపురం, వాళ్ల కాపురాలను నాశనం చేయాలని నాకు లేదు. నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకోమని కనకం అంటుంది. ఇక రాజ్ కోపంగా ఇంటికి వెళ్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.