Brahmamudi, December 30th Episode: కంపెనీపై రుద్రాణికి వచ్చిన అనుమానం.. కావ్య, రాజ్‌లకు దెబ్బ మీద దెబ్బ!
సీతారామయ్య ఆస్పత్రి బిల్ ఎలా కట్టాలా అని రాజ్ ఆలోచిస్తూ ఉండగా.. కావ్య వచ్చి తన నగలు ఇచ్చి తాకట్టు పెట్టమని అంటుంది. రాజ్ ఆ నగలను తాకట్టు పెట్టి ఆస్పత్రి బిల్ కట్టేస్తాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో సీతారామయ్య ఉన్న విషయం అప్పూకి తెలిసిపోతుంది. ఉన్నదే సరిపోదు అనుకుంటే.. కావ్య, రాజ్‌లకు మరో దెబ్బ మీద దెబ్బ తగులుతుంది..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతుందని రాజ్ అబద్ధం చెప్పాడాన్ని రుద్రాణి అనుమానిస్తుంది. రాజ్ కావాలనే అంతా కవర్ చేస్తున్నాడని నీకు అనిపించడం లేదా అని ధాన్యలక్ష్మితో అంటుంది. రాజ్‌కి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? అని ధాన్యలక్ష్మి అంటే.. కావ్య మీద ప్రేమతో అలా చేస్తున్నాడేమో.. చూస్తున్నావు కదా వాళ్లు కొన్ని రోజులుగా చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం, మనల్ని పనోళ్ల కంటే హీనంగా చూడటం.. ఇదంతా చూస్తుంటే వాళ్లు మనకు ఏదో తెలియకుండా గేమ్ ఆడుతున్నారు. వీళ్లిద్దరూ చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు ఎలాంటి పొంతన లేదు. ఇద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు. మనం ఆస్తి గురించి గొడవలు చేస్తున్నామని డబ్బులు అన్నీ కావాలనే అకౌంట్స్‌కి ట్రాన్సఫర్ చేసుకుని ఉండాలి. లేదంటే అకౌంట్స్‌లో డబ్బులు నిజంగానే లేకుండా ఉండాలని రుద్రాణి అంటే.. ఇంత పెద్ద కంపెనీకి ఎందుకు డబ్బులు లేకుండా ఉంటాయని ధాన్యలక్ష్మి అంటే.. ఎంత పెద్ద కంపెనీ అయినా ఒక్కోసారి సడెన్‌గా కుదేలు అయిపోతుంది. కాబట్టి ఏదో జరిగి ఉంటుంది. నీ సపోర్ట్ నాకు కావాలని రుద్రాణి అడుగుతుంది. సరే నా సపోర్ట్ కూడా నీకే అని ధాన్యలక్ష్మి అంటుంది.
నగలు తాకట్టు పెట్టిన కావ్య..
మరోవైపు డబ్బు ఎలా కట్టాలని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ల ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు రాజ్. కానీ వాళ్లు ఎవరూ లేరని అంటారు. అప్పుడే కావ్య వచ్చి అంతా వింటుంది. ఆ తర్వాత తన నగలు తీసుకొచ్చి ఇస్తుంది. ఇవి తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వమని కావ్య అంటే.. రాజ్ వద్దు అంటాడు. కాంట్రాక్ట్ పూర్తి అయ్యాక విడిపించుకుందామని కావ్య చెబుతుంది. రాజ్ ప్రేమగా కావ్యని చూస్తే.. ఏంటి అలా చూస్తున్నారు.. అరే ఇంత మంది భార్యను నేను.. ఇన్నాళ్లూ అపార్థం చేసుకుని దూరంగా ఉంచానే అన్న పశ్చాత్తాపంతో నన్ను గట్టిగా కౌగిలించుకోవాలి అనుకుంటున్నారు కదూ అని కావ్య అంటే.. దొంగముఖంది నా మనసులో ఉన్న మాట పసిగట్టేసిందని రాజ్ అంటాడు. నగలు ఇచ్చినందుకు అవసరం కోసం ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది. నేను జస్ట్ థాంక్స్ చెబుదాం అనుకున్నా అంతే అని రాజ్ పడుకుంటాడు. దీంతో కావ్య కోపంగా చూస్తాడు.
నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు..
ఇక తెల్లవారుతుంది. సీతారామయ్య దగ్గర కళ్యాణ్ ఉంటా. కళ్యాణ్‌కు అప్పూ ఫోన్ చేస్తుంది. నన్ను పూర్తిగా మర్చిపోయావు. నేను ఫోన్ చేస్తేనే నాతో మాట్లాడుతున్నావు. నేను గుర్తు చేస్తేనే నన్ను గుర్తు చేసుకుంటున్నావు. నీది అంతా దొంగ ప్రేమ.. చాలా మారిపోయావని అప్పూ అంటుంది. అప్పూ ఆపు.. ఇప్పుడు నేను ఏం చేశానని కళ్యాణ్ అడుగుతాడు. లాస్ట్ టైమ్ కాల్ చేసినప్పుడు నాకు ఏం చెప్పావు.. నీకేం గుర్తు లేదు. అంతా మారిపోయావు.. వీకెండ్‌లో నా దగ్గరకు వస్తాను అన్నావు కదా.. మర్చిపోయావు.. అంతా అయిపోయింది. ఇంక నేను కూడా న్యాయ పోరాటం చేయాల్సిందేనని అప్పూ అంటుంది. అసలు నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అని కళ్యాణ్ అంటే.. నిజం చెప్పు నువ్వు ఏమన్నా చిన్న ఇల్లు మెయిన్‌టైన్ చేస్తున్నావా అని అప్పూ అడుగుతుంది. నాకు అంత సీన్ లేదని కళ్యాణ్ అంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి.. మీరు ఇంకా బిల్ చేయలేదు. ఇలా చేస్తే ఆస్పత్రి రూల్స్ ఒప్పుకోవు అని అంటాడు. అదంతా అప్పూ వింటుంది. కళ్యాణ్ కాల్ కట్ చేస్తాడు.
అప్పూకి తెలిసిపోయిన నిజం..
అలా ఏమీ ఉండదు.. మా అన్నయ్య అలా చేయడే అని కళ్యాణ్ అంటే.. లేదు సర్ చెక్ చేసే చెబుతున్నాం. బిల్ కట్టకుండా పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేయాలంటే ఎలా? మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా అని డాక్టర్ అంటాడు. మా తాతయ్య విషయంలో మా అన్నయ్య ఇలా చేయడు. ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉండొచ్చు.. చూడమని కళ్యాణ్ అంటాడు. అప్పుడే నర్స్ వచ్చి బిల్ పే చేసినట్టు చెబుతుంది. ఇక డాక్టర్ వెళ్లిపోతాడు. అప్పటికే అప్పూ ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇక కళ్యాణ్ ఫోన్ ఎత్తగానే.. ఏం దాస్తున్నావ్ నా దగ్గర.. ఆస్పత్రిలో ఎవరు ఉన్నారు? అని అప్పూ అడిగే సరికి అంతా చెప్తాడు కళ్యాణ్. మరి నాకెందుకు చెప్పలేదని అప్పూ అంటే.. నువ్వు ట్రైనింగ్ వెళ్తున్నావ్.. నువ్వు ట్రైనింగ్ వదిలేసి వస్తావనే నేను చెప్పలేదు. నువ్వు ముందు ట్రైనింగ్ పూర్తి రమ్మని కళ్యాణ్ చెప్తాడు. సరేనని అంటుంది అప్పూ.
దెబ్బ మీద దెబ్బ..
ఆ తర్వాత రాజ్ మరో బిల్ చూసి షాక్ అవుతాడు. అప్పుడే కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రాజ్ పట్టించుకోకుండా ఉంటే.. ఏవండీ ఏమైందని కావ్య అడుగుతుంది. ఇక వచ్చిన బిల్‌ని రాజ్ చూపిస్తాడు. అది చూసి కావ్య కూడా షాక్ అవుతుంది. రెంటెండ్ కార్లకు మూడు లక్షల బిల్లా.. ఇప్పుడు ఇది ఎలా కట్టాలి అని ఆలోచిస్తారు. అప్పుడే కావ్యకు ఓ ఆలోచన వస్తుంది. కార్లు తిరిగి ఇచ్చేద్దామని అంటే.. అలా చేస్తే ఇంట్లో వాళ్లు ఊరుకుంటారా.. మళ్లీ గొడవ స్టార్ట్ చేస్తారని అంటాడు రాజ్. వాళ్లు అంటే భరించడానికి నేను ఉన్నాను కదా.. చూసుకుంటానని కావ్య అంటుంది. దీంతో రాజ్ ప్రేమగా కావ్య వైపు చూస్తాడు. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌లో కార్లను వెనక్కి పంపించేయడం చూసి రుద్రాణి రచ్చ లేపడానికి చూస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..