Sonakshi Sinha: హిందువుల పండుగలప్పుడే నీతులు గుర్తుకొస్తాయా? సోనాక్షి వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ఇక్బాల్ ఆస్ట్రేలియాలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సోనాక్షి, జహీర్‌లను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి ఒక ప్రత్యేక కారణముంది.. అదేంటంటే..
ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పార్టీలు చేసుకున్నారు. విందులు, వినోదాల్లో మునిగి తేలారు. ఇక కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న నటి సోనాక్షి సిన్హా, భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఇప్పుడు సిడ్నీలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. సిడ్నీలోని ఓ అందమైన ప్రదేశానికి వెళ్లిన సోనాక్షి, జహీర్ జనవరి 31 అర్ధరాత్రి 12 గంటలకు ఒక రొమాంటిక్ వీడియో ద్వారా అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. అయితే వీరిద్దరు నిలబడి ఉన్న చోట క్రాకర్లు సౌండ్స్, బాణసంచా వెలుగులు కనిపించాయి. దీంతో ఈ వీడియో చూసి నెటిజన్లు సోనాక్షిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ నెటిజన్ల కోపానికి ఒక కారణముంది. అదేంటంటే..
ఈ ఏడాది దీపావళి సందర్భంగా సోనాక్షి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో దీపావళి రోజున పటాకులు పేల్చేవారిని ఇడియట్స్‌గా అభివర్ణించింది. ‘బాణసంచా కాల్చడం వల్ల గాలి నాణ్యత ఇలా దారుణంగా పడిపోయింది. పటాకులు పేల్చే వారిని నేను అడగాలనుకుంటున్నాను, మీరంతా మూర్ఖులారా’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కొందరు నెటిజన్లు స్వాగతిస్తే, చాలామంది తప్పుపట్టారు. హిందూ పండగల సమయాల్లోనే మీకు ఇలాంటివి గుర్తుకొస్తాయా మేడమ్? అంటూ నెటిజన్లు సోనాక్షిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మరోసారి ఈ హీరోయిన్ ను టార్గెట్ గా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీపావళి సందర్భంగా మాత్రమే పటాకులు పేల్చడం వల్ల కాలుష్యం కలుగుతుందా? కొత్త సంవత్సరంలో పటాకులు పేల్చడం వల్ల ఆక్సిజన్ విడుదలవుతుందా? ఇది ఎంత దారుణం’ అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. పటాకులు పేల్చడం వల్ల జంతువులను భయపడతాయని, దీపావళి సందర్భంగా వాటిని పేల్చకూడదని సెలబ్రిటీలు ఎప్పుడూ చెబుతుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జంతువులు లేవా? అంటూ సోనాక్షిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సోనాక్షి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో..
View this post on Instagram
జూన్ 23న సోనాక్షి, జహీర్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాకముందు ఇద్దరూ ఆరేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. కాగా పెళ్లి తర్వాత సోనాక్షి, జహీర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తు హై మేరీ కిరణ్’. దర్శకుడు కరణ్ రావల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.