ఓరి నాయనో నెట్టింట దుమ్మురేపుతున్న టిల్లు పాప నేహా శెట్టి పిక్స్

Phani CH

04 January 2025

నేహా శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు..  ఈ ఏడాది రెండు వరుస సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.

మోడలింగ్‌ లోకి వచ్చిన నేహా, 2014లో మిస్ మంగళూరు అందాల పోటీతో గెలిచింది. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది.

ఈ చిన్నది 2016 'ముంగారు మేల్ 2' అనే కన్నడ సినిమాతో చిత్రసీమలో అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా అక్కడ యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. 

2018 లో తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.

ఆ తరువాత 'గల్లీ రౌడీ' సినిమాలో నటించగా.. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది.

సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత నుండి వరుస అఫ్ఫార్స్ తో దూసుకుపోతుంది.

తాజాగా నేహా శెట్టి.. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటించింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.