కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగ చెప్పాల్సిన పని లేదు.. చేసింది తక్కువ సినిమాలే అయిన బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది.
ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది.
భరత్ అనే నేను హిట్ అవ్వడంతో కియారా అద్వానీకు వినయ విధేయ రామ లో అవకాశం లభించగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.
తెలుగులో చేసిన రెండో సినిమానే డిశాస్టర్ అవ్వడంతో కియారాకు మరిన్ని అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడే స్టార్ అయిపోయింది.
ఆ తరువాత హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుండి సినిమాల విషయంలో స్పీడ్ తగ్గింది. దాంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు కూడా తగ్గాయి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ లో కియారా హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమా జనవరి 10 విడుదల కానుంది..
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తోన్న బాలీవుడ్ మూవీ వార్ 2లో కియారా అద్వానీ ఓ కథానాయికగా మెరవనుంది. టాక్సిక్ లో కూడ యశ్‌కు జోడీగా కియారా కనిపించబోతున్నది.