ట్రెడిషనల్ లుక్ లో నిధి అగర్వాల్.. వావ్ అంటున్న నెటిజన్స్

Phani CH

04 January 2025

నిధి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మొదటి సినిమాతోనే క్యూట్ అందాలతో అందరిని మెస్మరైజ్ చేసింది.

హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించిన నిధి అగర్వాల్. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తరువాత నాగ చైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

సవ్యసాచి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన నిధి అందం, అభినయానికి మాత్రం  తెలుగు ప్రేక్షక లోకం ఫిదా అయిపోయారు.

ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి క్రేజ్ కొట్టేసింది. ఈ సినిమా తరువాత వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చిన లైఫ్ మాత్రం టర్న్ అవ్వలేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో షేర్ చేసిన కొన్ని పిక్స్ క్రేజీ కామెంట్స్ తో నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.