04 January 2025
ఫస్ట్ మూవీతో హిట్టు.. చేతిలో ఒక్క సినిమాలో లేదు.. తగ్గని క్రేజ్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉద్యోగం వదిలేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్. కానీ ఆఫర్స్ అంతగా రావట్లేదు.
ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేదు. దీంతో అటు స్పెషల్ సాంగ్స్, ఇటు సెకండ్ హీరోయిన్గా చేసేందుకు సిద్ధమయ్యింది. తనే హీరోయిన్ ప్రియాంక జవాల్కర్.
విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్. అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడుకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో అంతగా ఆఫర్స్ రాలేదు. చేతిలో ఒక్క సినిమా లేదు.
1992 నవంబర్ 12న అనంతపురంలో మరాఠీ కుటుంబంలో జన్మించింది ప్రియాంక. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకుంది.
ఆ తర్వాత అమెరికాలోని MNC కంపెనీలో పనిచేసింది. ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. కలవరమాయే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ వెంటనే టాక్సీవాలా సినిమాతో హిట్టుకొట్టింది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటికీ ఆఫర్స్ అంతగా రావడం లేదు.
ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట అరాచకం సృష్టిస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్