పవన్ కల్యాణ్‌కు ఇష్టమైన హీరోలు ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు.

04 January 2025

Basha Shek

సినిమాల్లో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలందిస్తున్నారు.

అయితే చాలామంది అభిమానులు మాత్రం ఆయనను మళ్లీ వెండితెరపై చూడాలని ఆరాటపడుతున్నారు

 ప్రస్తుతం  పవన్ కల్యాణ్ చేతిలో మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చినవే.

హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లతో పాటు  ఓజీ సినిమాలు పవన్ కల్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. 

కాగా సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు 10మంది హీరోలు ఆ కుటుంబం నుంచే వచ్చారు.

చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్,రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్ ఉన్నారు.

అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు బాగా ఇష్టమైన హీరోలు ఎవరో తెలుసా? ఎన్టీఆర్, ప్రభాస్ అట.

 అలాగే చిరంజీవి, రామ్ చరణ్ అంటే కూడా తనకు ఇష్టమని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్