Rohit Sharma: రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు షాక్.. టెస్టు కెప్టెన్‌గా ఆ ప్లేయర్‌కి ఛాన్స్

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టుకు రోహిత్ శర్మ తప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని కోచ్ గంభీర్, ఛీఫ్ సెలెక్టర్ అగార్కర్‌కు చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి వారు ఒప్పుకున్నట్లు తెలిసింది. అయితే ఈ టెస్టు మ్యాచ్‌కు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై రేపు స్పష్టత రానుంది. ఆకాశ్ దీప్‌కు గాయం అవ్వడంతో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెెలుస్తుంది.

Rohit Sharma: రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు షాక్.. టెస్టు కెప్టెన్‌గా ఆ ప్లేయర్‌కి ఛాన్స్
Rohit Sharma
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Jan 02, 2025 | 6:04 PM

సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ దూరం కావడం ఖాయంగా కనిపిస్తుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో రోహిత్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, శుభ్‌మన్ గిల్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి రానున్నాడు. రోహిత్ శర్మ ఘోరంగా విఫలం అవుతున్నాడు. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో, న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రోహిత్ విఫలమయ్యాడు. అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో కూడా 3 టెస్టుల్లో విఫలమయ్యాడు. రోహిత్ చెత్త ప్రదర్శన చేయడం వల్ల టీమిండియా జట్టు ఓటములను చవిచూడాల్సి వచ్చింది. పెర్త్‌లో జరిగిన టెస్ట్‌లో గెలిచిన తర్వాత టీమిండియా అడిలైడ్, మెల్‌బోర్న్‌లలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో ఓడిపోయింది.రోహిత్ శర్మను స్యయంగా ఆయనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తను ఫామ్‌లో లేని కారణంగా రోహిత్ శర్మ సిడ్నీలో ఆడబోనని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు సమాచారం. దీని గురించి రోహిత్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు కూడా తెలియజేసాడు. గంభీర్, అగార్కర్ ఇద్దరూ దీనికి అంగీకరించినట్లు తెలుస్తుంది.

రోహిత్ టెస్టు కెరీర్ ముగిసిందా?

ఇదే నిజమైతే, రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఆడకపోతే, ఈ దిగ్గజ ఆటగాడి టెస్టు కెరీర్‌కు ఇదే ముగింపు పలికినట్లేనా? ఈ టెస్టు సిరీస్ తర్వాత రోహిత్ టెస్టు నుంచి తప్పుకుంటాడని వార్తలు వచ్చాయి. సిడ్నీలో చివరి టెస్టు ఆడతాడని అంతా భావించారు కానీ ఇప్పుడు రోహిత్ తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడకపోవచ్చని తెలుస్తోంది. మెల్‌బోర్న్ టెస్టే అతని కెరీర్‌లో చివరి టెస్టులా కనిపిస్తుంది. సిడ్నీ టెస్టులో టీమిండియా విజయం సాధించి, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా ఫైనల్ చేరితే, ఆ టైటిల్ పోరుకు రోహిత్ ఎంపికయ్యే అవకాశం లేదు.

రోహిత్ శర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కూడా సిడ్నీ టెస్టుకు దూరం కావచ్చు. ఆకాశ్ దీప్ గాయపడినట్లు తెలుస్తుంది. అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం లభించవచ్చు. ప్రసిద్ధ్ కృష్ణను మొదటి నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో బెంచ్‌పై కూర్చోబెట్టారు. అతను ఈ పర్యటనలో మొదటి మ్యాచ్ ఆడనున్నాడు. ఈ టెస్టుకు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించునున్నట్లు తెలుస్తుంది

టీమిండియా అంచనా ప్లేయంగ్ ఎలెవన్

కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి