Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏకంగా 9 సెలవులు..
అకడమిక్ క్యాలెండర్ విషయాన్ని పక్కనపెడితే.. ప్రభుత్వం విడుదల చేసిన 2025 క్యాలెండర్ ప్రకారం.. జనవరి నెలలో.. మొత్తం 9 తొమ్మిది సెలవు దినాలు ఉన్నాయి. ఆయా తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ మూసివేసి ఉంటాయి. ఆ తేదీలు ఏంటో డీటేల్డ్‌గా తెలుసుకుందాం పదండి....
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు 2025 జనవరిలో తొమ్మిది సెలవులు ఉండబోతున్నాయి. ఈ సెలవుల్లో నాలుగు ఆదివారాలు ఉంటాయి. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో నాలుగు సాధారణ సెలవులు ఉన్నాయి. అవి నూతన సంవత్సర దినోత్సవం (జనవరి 1), భోగి (జనవరి 13), సంక్రాంతి/పొంగల్ (జనవరి 14). అలానే గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున కూడా సెలవు ఉంటుంది. రిపబ్లిక్ డే సాధారణ సెలవుదినం అయినప్పటికీ, ఈ సంవత్సరం ఆదివారం రావడంతో విద్యార్థులకు ఒక హాలిడే మిస్ అయింది. మిగిలిన సెలవు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది.
ఆదివారాలు, సాధారణ సెలవులు కాకుండా, జనవరిలో మూడు ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. హజ్రత్ అలీ పుట్టినరోజు (జనవరి 14), కనుము (జనవరి 15)తో పాటు షబ్-ఎ-మెరాజ్ (జనవరి 25) తేదీల్లో ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చింది. హజ్రత్ అలీ పుట్టినరోజు ఆప్షనల్ హాలిడే లిస్ట్‌లో చేర్చినప్పటికీ.. అదే రోజున సంక్రాంతి/పొంగల్ నేపథ్యంలో జనవరి 14 సాధారణ సెలవుదినం కిందకు వస్తుంది. తెలంగాణలోని అన్ని పాఠశాలలు ఆప్షనల్ సెలవుల్లో మూసివేయబడవు. అయితే, షబ్-ఎ-మెరాజ్ రోజున చాలా మైనారిటీ పాఠశాలలకు సెలవు ఉంటుంది.
ఇది ప్రభుత్వం విడుదల చేసిన ఏడాది క్యాలెండర్ ప్రకారం సెలవుల జాబితా. అయితే 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని విద్యా శాఖ పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..