Game Changer Trailer: గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చేసింది..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. అలాగే అంజలి, కియాారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

Game Changer Trailer:  గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చేసింది..
Game Changer Trailer
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2025 | 5:52 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ కట్టిపడేశాయి. అలాగే ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే.. తాజాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ చేశారు.

కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చిన నష్టం ఏమీ లేదు, మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ఇక రామ్ నందన్, అప్పన్న పాత్రలలో చరణ్ యాక్టింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. అంజలి, ఎస్ జే సూర్య యాక్టింగ్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. తమన్ అందించిన మ్యూజిక్ బాగుంది.

డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో చరణ్ లుక్స్, మేనరిజం మరోసారి మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. అలాగే చాలా కాలం తర్వాత ఈ సినిమాతో శంకర్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కొండాపూర్ లోని ABM మాల్ లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు భారీ ఎత్తున ఫ్యాన్స్ రావడంతో పోలీసు బందోబస్త్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.