Brahmamudi, June 22nd Episode: అనూహ్యమైన నిర్ణయం తీసుకున్న కావ్య.. ఇక అసలైన కథ మొదలు..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మాయను వెతకడానికి కారులో బయలు తేరతారు. ఇంతలో కారు మధ్యలో ఆగిపోతుంది. ఇక రాజ్ కిందకు దిగి.. కారు సెట్ చేస్తాడు. ఆ తర్వాత కారులో మళ్లీ బయలు దేరతారు. ఈలోపు కారు అద్దంలో మాయ పరుగెడుతున్నట్టు కావ్యకి కనిపిస్తుంది. దీంతో కావ్య కారు ఆపమంటుంది. రాజ్ దిగి చూడగా.. మాయని ఎవరో రౌడీలు తరుముతూ ఉంటారు. వెంటనే మాయని కావ్య వాళ్ల దగ్గరకు వస్తుంది. రాజ్‌ని చూసిన రౌడీలు..

Brahmamudi, June 22nd Episode: అనూహ్యమైన నిర్ణయం తీసుకున్న కావ్య.. ఇక అసలైన కథ మొదలు..
Brahmamudi
Follow us

|

Updated on: Jun 22, 2024 | 12:54 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మాయను వెతకడానికి కారులో బయలు తేరతారు. ఇంతలో కారు మధ్యలో ఆగిపోతుంది. ఇక రాజ్ కిందకు దిగి.. కారు సెట్ చేస్తాడు. ఆ తర్వాత కారులో మళ్లీ బయలు దేరతారు. ఈలోపు కారు అద్దంలో మాయ పరుగెడుతున్నట్టు కావ్యకి కనిపిస్తుంది. దీంతో కావ్య కారు ఆపమంటుంది. రాజ్ దిగి చూడగా.. మాయని ఎవరో రౌడీలు తరుముతూ ఉంటారు. వెంటనే మాయని కావ్య వాళ్ల దగ్గరకు వస్తుంది. రాజ్‌ని చూసిన రౌడీలు పారిపోతారు. ఇంతలో మాయకి కళ్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడే కావ్య ఒక్కటి ఇస్తుంది. ఎందుకు కొట్టావ్ అని రాజ్ అంటే.. కొట్టకపోతే మళ్లీ తను కోమాలోకి వెళ్లిపోతుందని కావ్య అంటుంది. వెంటనే మాయని ఇంటికి తీసుకెళ్తారు. హాలులో అందరూ సమావేశమవుతారు.

మీకే గుండెనొప్పి రావడానికి..

ఆ మాయ అబద్ధం.. ఈ మాయే నిజం. ఈ నిజాన్ని మీ ముందు నిలబెట్టడానికే నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఈ నిజం వెనుక ఎన్నో అబద్ధాలు ఉన్నాయి. ఇన్ని రోజులూ మావయ్య గారు కూడా మోసపోయారు. మోసం చేసింది మావయ్య కాదు.. ఈ మాయ. అందరి ముందూ నిజం చెప్పు అని కావ్య అంటుంది. అప్పుడే రుద్రాణి అడ్డు పడి.. ఏ మాయ చేద్దామని ఇంకో మాయని తీసుకొచ్చావు కావ్యా.. ఇదో నాటక పర్వమా.. అప్పుడు ఆ నాటకం వల్ల మా వదినకి హార్ట్ స్ట్రోక్ తెప్పించావ్? ఇప్పుడు ఎవరికి గుండె నొప్పి తెప్పించాలని చూస్తున్నావ్ అని రుద్రాణి అడిగితే.. మీకే రుద్రాణి అని కావ్య అంటుంది. ఆ పని చేయవే దరిద్రం వదులుతుంది. నెలకో పిండం పెట్టి దండం పెట్టుకుంటాను అని స్వప్న అంటుంది.

సాక్ష్యం ఏంటి..

ఈ మాయ నిజం మాయ అని చెప్పడానికి సాక్ష్యం ఏంటి? అని రుద్రాణి అడిగితే.. ఈమెనే మాయ అని సుభాష్ అంటాడు. అంతా అబద్ధం.. వీళ్ల ముగ్గురూ కలిసి.. మా వదినని మోసం చేయాలని చూస్తున్నారు. అన్నయ్య తప్పు ఏమీ లేదని చెప్పడానికి ఇంత కష్ట పడుతున్నారని రుద్రాణి అంటే.. నీకెలా తెలిసిందో చెప్పమని రాజ్ అంటాడు. ఆ తర్వాత అందరూ రుద్రాణిని దూషిస్తారు.

ఇవి కూడా చదవండి

కావ్య పెద్ద ప్రమాదంలో పడింది..

మమ్మీ డాడీ మోసపోయారు. అదే నిజం. ఈ నిజాన్ని కావ్యే ముందుగా గుర్తించింది. డబ్బు కోసం బిడ్డను వదులుకున్న మనిషి నిజాయితీ గురించి అనుమానించింది. నెలకు 10 లక్షలు తీసుకునే ఈ మాయ నిజాన్ని బయట పెట్టాలనే ప్రయత్నంలో ఒకసారి చాలా పెద్ద ప్రమాదంలో పడింది. ఆ తర్వాత ఈ మాయ ఉండాల్సి అడ్రెస్‌లో ఆ దొంగ మాయ ఉంది. కావ్యని మోసం చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టింది. దాని వల్ల పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందో మీ అందరికీ తెలుసు. అందుకే అప్పుడు డాడీ నిజం చెప్పాల్సి వచ్చింది. అయినా కావ్య ప్రయత్నాలు ఆపలేదు. అసలు మాయని తీసుకొచ్చి మన ముందు పెట్టాలి అనుకుంటే కోమాలోకి వెళ్లింది. అప్పుడు ఆమెని ఎవరో తప్పించి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి పారిపోతూ మాకు దొరికింది. ఇదే జరిగిన నిజమని రాజ్ చెప్తాడు.

నిజం చెప్పేసిన మాయ.. ఆ బిడ్డ మా ఇద్దరి బిడ్డ కాదు..

ఆ తర్వాత అసలు నిజం చెప్పేస్తుంది మాయ. నేనే మాయను.. నాకు తెలీకుండానే నా ప్రమేయం లేకుండా సుభాస్ జీవితంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఆ బిడ్డ నాకూ సుభాష్‌ గారికి పుట్టిన బిడ్డ కాదు. ఆ బిడ్డకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో తెలీదు. మీ కుటుంబం పరువు తీయడానికో.. కావాల్సిన డబ్బు లాగడానికో నన్ను కొందరు బెదిరించారు. సుభాష్ గారికి, నాకు పరిచయాన్ని అడ్డం పెట్టుకుని నాటకం ఆడమని చెప్పారు. నన్ను బ్లాక్ మెయిల్ చేసి నెలకు పది లక్షలు అడిగి తీసుకోమన్నారు. లేకపోతే.. నా ప్రాణాలు తీస్తామని బెదిరించారు. దీంతో నేను సుభాష్ గారెని బెదిరించాల్సి వచ్చింది. నాకు తెలుసు.. ఈ నిజం మీకు గుండెల్ని గాయం చేస్తుందని.. కానీ ఇందులో ఆయన తప్పేం లేదు. తప్పు అంతా నాదే. నేను మళ్లీ మీ జీవితంలోకి రాను అని క్షమించమని అడుగుతుంది మాయ.

మాయ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి..

మరి ఈ దొంగ మాయని ఏం చేద్దాం. పోలీసులకు పట్టిద్దామా అని ధాన్య లక్ష్మి అంటే.. మీ ఇష్టం అని మాయ అంటుంది. సరే అని పోలీసులకు ఫోన్ చేస్తుండగా.. ఆగు ప్రకాశం. తప్పు జరిగింది అనేది వాస్తవం. మీ అన్నయ్య వైపు కూడా తప్పు ఉంది కదా.. ఆ తర్వాత ఇదంతా ఎవరో బెదిరించి చేయించారు. ఇందులో ఈమె ప్రమేయం ఏం ఉంది? ఈమెని శిక్షించి ఏం లాభం? దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని సీతా రామయ్య, పెద్దావిడ అంటారు. దీంతో మాయ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మేమే పెంచుకుంటాం..

ఇప్పుడు ఈ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. అపర్ణా నీకు సంతోషమేనా అని పెద్దావిడ అంటుంది. మరి ఆ బిడ్డ సంగతి ఏంటి? ఇదేమీ ఆర్తులకు, అనాథలకు ఆశ్రయం ఇచ్చే శరణాలయం కాదు కదా.. కాబట్టి వాడిని ఏ అనాథ శరణాలయంలో చేర్పించేద్దామని రుద్రాణి అడుగుతుంది. దీంతో అందరూ అయోమయంలో పడతారు. ఈ ఇంట్లో నేను కోడలిగా అడుగు పెట్టాక.. నా కోసం నేను ఎప్పుడూ ఏమీ అడగ లేదు. ఇన్ని రోజులూ కన్న తల్లి స్థానంలో ఉండి ఆ బిడ్డను పెంచాను. అనాథలా వదిలేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నేనే పెంచుకోవాలి అనుకుంటున్నా అని కావ్య అంటే.. ఒసేయ్ పిచ్చిదానా ఆ బిడ్డ వల్లే కదా ఇన్ని సమస్యలు ఎదుర్కున్నాం. వదిలేయరాదూ అని స్వప్న అంటే.. వద్దు స్వప్న కళావతి నిర్ణయం నాకు నచ్చింది. రక్త సంబంధం లేకపోయినా.. అనుబంధం ఏర్పడింది.

కావ్య, రాజ్‌ల సరసం..

చాలా సంతోషంగా ఉంది. నా మనవడిని, నిన్నూ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అత్త, మామల మధ్య ఏర్పడి కలతలు తీర్చడానికి ఎంతో కష్ట పడ్డావ్. నిజంగానే నువ్వు మా ఇంటి మహా లక్ష్మి అమ్మా అని పెద్దావిడ అంటే.. రాజ్ నవ్వుతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో రాజ్, కావ్యకి దగ్గర కావాలి అనుకుంటాడు.