Jabardasth Faima: ‘అక్కా మీ పెళ్లెప్పుడు’? నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన జబర్దస్త్ ఫైమా

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ఫైమా గురించి మన తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ తో ఎంట్రీ ఇచ్చిన ఆమె జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే బోలెడు ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ లేడీ కమెడియన్ హౌజ్ లో తన ఆట, మాట తీరుతో మరింతమంది అభిమానులను సంపాదించుకుంది.

Jabardasth Faima: 'అక్కా మీ పెళ్లెప్పుడు'? నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన జబర్దస్త్ ఫైమా
Jabardasth Faima
Follow us

|

Updated on: Jun 23, 2024 | 10:37 AM

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ఫైమా గురించి మన తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ తో ఎంట్రీ ఇచ్చిన ఆమె జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే బోలెడు ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ లేడీ కమెడియన్ హౌజ్ లో తన ఆట, మాట తీరుతో మరింతమంది అభిమానులను సంపాదించుకుంది. గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించకపోయినా ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత స్టార్ మా ఈవెంట్లలో తెగ సందడి చేసింది ఫైమా. ముఖ్యంగా ‘బీబీ డ్యాన్స్’ షోలో పాల్గొని సూర్యతో కలిసి విజేతగా నిలిచింది. ఆ తర్వాత కూడా పలు ఈవెంట్లతోనూ ఆడియెన్స్ కు ఎంటర్ టైన్మెంట్ అందించింది. ఇటీవలే తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చిందీ స్టార్ కమెడియన్. బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో కంటెస్టెంట్ గా మళ్లీ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోంది.

ఇదిలా ఉంటే టీవీషోలతోనే కాకుండా తన పర్సనల్ లైఫ్ పరంగా కూడా వార్తల్లో నిలుస్తోంది ఫైమా. పటాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచే తోటి కమెడియన్ ప్రవీణ్‌తో ఫైమా ప్రేమాయణం సాగించిందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ కలిసి ఫొటోలు దిగడం, బహమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. దీంతో ఈ రూమర్లను నిజమేననుకున్నారు. అయితే ఇంతలోనే తాము విడిపోయామంటూ ఫ్యాన్స కు షాకిచ్చారు ప్రవీణ్, ఫైమా. ఈ క్రమంలోనే తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసి మరో ట్విస్ట్ ఇచ్చింది ఫైమా. ఇప్పుడు తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ లేడీ కమెడియన్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఫైమా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో మాటా మంతి నిర్వహించింది. అందులో ఓ నెటిజన్ ‘అక్కా మీ పెళ్లి ఎప్పుడు’ అని ప్రశ్నించారు. దీనికి ఫైమా ‘పెళ్లి జరిగినప్పుడే’ అంటూ తెలివిగా సమాధానమిచ్చింది. అయితే ఎప్పుడు చేసుకుంటానన్నద మాత్ర క్లారిటీ రాలేదు. మొత్తానికి పెళ్లి విషయంలో ఫైమా కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొత్త  లవర్ తో జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా.. ఫొటోస్ ఇదిగో..

తన బర్త్ డే పార్టీలోనే పటాస్ ప్రవీణ్ తో జబర్దస్త్ ఫైమా.. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by FAIMA (@faima_patas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !
తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు..
తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు..
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి.
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి.
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..