Brahmamudi, December 15th episode: హద్దులు దాటేస్తున్న రాజ్ ప్రియురాలు.. స్వప్నని కాపాడిన అపర్ణ! కుళ్లుకుంటున్న అనామిక..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య 108 ప్రదక్షిణలు చేయడం మొదలు పెడుతుంది. ఈ లోపు రాజ్ కావాలనే ఆట పట్టిస్తూ ఉంటాడు. కానీ కావ్య తన తెలివితో సమాధానం చెబుతుంది. అయితే ఆ తర్వాత కావ్య పట్టు వదలకుండా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇది గమనించిన రాజ్.. ఇదిగో నేను ఏదో నువ్వు నన్ను ఉపవాసం ఉంచావని.. కోపంతో ఈ ఫిటింగ్ పెట్టాను. నిజంగానే 108 తిరిగితే కళ్లు తిరిగి పడిపోతావ్.. చాలు ఆపేసేయ్ అని అంటాడు. 108 ప్రదక్షిణలు మీ కోసం కాదు.. నా కోసం చేస్తున్నా తగ్గేదెలే అని ప్రదక్షిణలు చేస్తుంది కావ్య. ఇదెక్కడి మొండి రాక్షసి దొరికింది నాకు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య 108 ప్రదక్షిణలు చేయడం మొదలు పెడుతుంది. ఈ లోపు రాజ్ కావాలనే ఆట పట్టిస్తూ ఉంటాడు. కానీ కావ్య తన తెలివితో సమాధానం చెబుతుంది. అయితే ఆ తర్వాత కావ్య పట్టు వదలకుండా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇది గమనించిన రాజ్.. ఇదిగో నేను ఏదో నువ్వు నన్ను ఉపవాసం ఉంచావని.. కోపంతో ఈ ఫిటింగ్ పెట్టాను. నిజంగానే 108 తిరిగితే కళ్లు తిరిగి పడిపోతావ్.. చాలు ఆపేసేయ్ అని అంటాడు. 108 ప్రదక్షిణలు మీ కోసం కాదు.. నా కోసం చేస్తున్నా తగ్గేదెలే అని ప్రదక్షిణలు చేస్తుంది కావ్య. ఇదెక్కడి మొండి రాక్షసి దొరికింది నాకు.. చెప్పింది అస్సలు వినదు అని రాజ్ తిట్టుకుంటాడు. ఈలోపు అనామిక, కనకం, స్వప్న గుడిలో కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు. ఈలోపు అరుణ్.. స్వప్నకి కనబడతాడు. దీంతో స్వప్న కంగారుగా లేచి.. అరుణ్ కోసం వెళ్తుంది. సరిగ్గా ఈలోపు అనామిక కాయిన్ నిలబడుతుంది. దీంతో అందరూ సంతోష పడతారు. అయితే ఈ లోపే కనకం.. సైలెంట్ గా అనామిక నిలబెట్టిన కాయిన్ పడేస్తుంది. దీంతో అనామిక కోపంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ప్రదక్షిణలు చేస్తూ కళ్లు తిరిగి పడిపోయిన కావ్య.. రాజ్ కంగారు..
ఈలోపు గుడిలో కావ్య ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. రాజ్ వద్దు ఆపేయ్.. కళ్లు తిరుగుతాయి అని చెప్పి వినకుండా తిరుగుతుంది. ఇలా ప్రదక్షిణలు దగ్గరకి వచ్చే సరికి కావ్యకి కళ్లు తిరుగుతూ ఉంటాయి. దీంతో పట్టుకుంటాడు. కావ్య పడి పోవడంతో.. ఆ చుట్టు పక్కల ఉన్న వారు, పంతులు గారు వచ్చి అడుగుతారు. ఉపవాసం ఉండి ప్రదక్షిణలు చేస్తే పడి పోయిందని చెప్తాడు రాజ్. ఈ నీళ్లు ముఖం మీద చల్లమని పంతులు గారు చెప్తారు. ఆ నీళ్లు చల్లి.. తాగిస్తాడు రాజ్. వసేయ్ ఇప్పుడు నాన్నమ్మ.. తాతయ్య చూస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా నన్ను తిడతారని కంగారు పడుతూ ఉంటాడు. కార్తీక మాసంలో కోరుకున్న కోరిక తీర్చకుండా ఉండకూడదు బాబూ.. మీరే ఆవిడని ఎత్తుకుని ప్రదక్షిణలు పూర్తి చేయమని చెప్తారు. దీంతో రాజ్ తప్పదని అనుకుంటూ కావ్యని ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తాడు. సరిగ్గా అప్పుడే ఇంట్లోని వారంతా వచ్చి రాజ్, కావ్యలను చూస్తారు. వాళ్లను చూసి మురిసి పోతారు. దీంతో ధాన్య లక్ష్మి కూడా నేను కూడా ప్రదక్షిణలు చేస్తానని సరదగా అంటుంది. అమ్మో అంత ప్రాణంతకరమైనవి వద్దు అని చెప్తాడు ప్రకాష్. దాంతో అందరూ ఒక్కసారిగా నవ్వుతారు.
జస్ట్ మిస్ అయిన అరుణ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్వప్న..
అప్పుడే కనకం.. ఏది స్వప్న కనిపించడం లేదని అంటుంది. ఇందాకటి నుంచి కూడా కనిపించడం లేదని అప్పూ అంటే.. సరే అందరూ తలో దిక్కుకు వెళ్లి వెతుకుదాం పదండి అని పెద్దావిడ అంటుంది. ఇక అందరూ తలో దిక్కున వెళ్లి స్వప్నని వెతుకుతూ ఉంటారు. ఈలోపు స్వప్న.. అరుణ్ ని వెంబడిస్తూ ఉంటుంది. కోనేటిలో పడితుందని రాహుల్, రుద్రాణిలు ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా ఇంకొంచెం ముందుకు వెళ్లగా.. అరుణ్ ని పట్టుకుందామని పరుగు తీస్తున్న స్వప్న.. అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి.. త్రిశూలం మీదకు పడబోతుంది. సరిగ్గా అప్పుడే అపర్ణ.. స్వప్న చేయి పట్టుకుని వెనక్కి లాగుతుంది. దీంతో స్వప్న ప్రాణంతో సేఫ్ గా బయట పడుతుంది. ఇదంతా చూసిన మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ పరుగున అక్కడికి వస్తారు. స్వప్న సేఫ్ గా ఉండటంతో ఛా అనుకుంటూ రుద్రాణి, రాహుల్ కూడా వస్తారు.
త్రిశూలం మీద పడబోయిన స్వప్నను కాపాడిన అపర్ణ..
ఏంటిది? ఏం చేస్తున్నావ్? ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏం జరిగేదో తెలుసా? అంటూ కోపంతే అరుస్తుంది అపర్ణ. చాలా థాంక్స్ ఆంటీ.. నన్నే కాకుండా మీరు నా కడుపులో బిడ్డను కూడా కాపాడారని ఎమోషనల్ గా అంటుంది. స్వప్నా ఎంత ప్రమాదం తప్పిందో.. నీకు ఏమైందే.. నీకు ఏమన్నా జరిగితే మేము ఏమ్ అయిపోయే వాళ్లమే.. అని కనకం కంగారుగా అంటుంది. ఇక అందరూ ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ‘ఆ అరుణ్ గాడు కనిపించాడు’ అంటూ ఆవేశంగా అంటుంది స్వప్న. వాడు ఎవడే అంటాడు కృష్ణమూర్తి అమాయకంగా.. నేను తర్వాత చెబుతానులే అయ్య అని కనకం అంటుంది. వాడు ఇక్కడికి రావడం ఏంటి? ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో.. అయినా వాడు ఇళ్లు ఖాళీ చేసేసాడుగా.. ఇక్కడేం చేస్తున్నాడని కావ్య కూడా అంటుంది. ఆపు నీ నాటకాలు మళ్లీ కొత్త డ్రామా మొదలు పెట్టావా అని రుద్రాణి అంటే.. ఫ్రెండ్ గా ఉండి వాడు నన్ను మోసం చేయవచ్చు.. కానీ నా కళ్లు నన్ను మోసం చేయవు. నేను వాడిని చూశాను. ఇక్కడే తిరుగుతున్నాడు. వాడిని పట్టుకుని కుక్కని కొట్టినట్టు కొట్టి.. నిజం చెప్పిదాం అనుకున్నా.. కానీ మిస్ అయ్యాడని స్వప్న అంటుంది.
వాడు ఇక్కడే ఉంటే.. ఎక్కడున్నా లాక్కొస్తానన్న కావ్య..
వాడు ఈ ఊరిలోనే ఉంటే.. ఖచ్చితంగా వాడిని వదిలి పెట్టను. ఎక్కడ ఉన్నా లాక్కొస్తాను. ఇలా నువ్వెందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావ్ అక్కా. అని కావ్య అంటుంది. అయినా ఆ డీఎన్ఏ టెస్ట్ ఏదో చేద్దాం అనుకున్నాం కదా. అప్పటివరకూ జాగ్రత్తగా ఉండాలని కదా అని ఇందిరా దేవి అంటుంది. అనామిక వాళ్లు మనకోసమే వెయిట్ చేస్తున్నారు.. రండి వెళ్దాం అని ధాన్య లక్ష్మి అంటే.. అందరూ పూజ కోసం వెళ్తారు. అయితే ప్లాన్ మిస్ అయినందుకు రుద్రాణి, రాహుల్ లు రగిలి పోతూ ఉంటారు.
రాజ్ కి గౌరమ్మగా శ్వేత.. కావ్య ఏం చేస్తుందో..
అందరూ గుడిలోకి వెళ్లగా.. పంతులు గారు కళ్లు మూసుకుని ఆ శివయ్యను తలుచుకోమని చెప్తాడు. అందరూ కళ్లు మూసుకుని దణ్ణం పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే సరిగ్గా.. శ్వేత వస్తుంది. వెనక నుంచి రాజ్ ని పిలుస్తుంది. శ్వేతను చూసి షాక్ అవుతాడు రాజ్. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావ్ తల్లీ.. వెళ్లు నేను వచ్చి కలుస్తాను అంటాడు. ఇప్పటికే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా.. నువ్వు నన్ను అవైడ్ చేస్తున్నావ్ కదా.. అని అంటాడు. లేదు నువ్వు వెళ్లు వచ్చి నేను కలుస్తాను అని శ్వేతని వెళ్లి పొమ్మంటాడు రాజ్. నువ్వు శివయ్య.. నేను గౌరమ్మ.. ఆవిడ గంగా దేవి అని చెప్పి వెళ్తుంది శ్వేత. దీంతో రాజ్ హమ్మయ్యా అని కళ్లు మూసుకుంటాడు. ఏంటిది? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు అని అడుగుతుంది కావ్య. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.