Bigg Boss 7 Telugu: ‘బిగ్‌బాస్’ ఫైనల్‌కు గెస్టులుగా ఆ ఇద్దరు.. మహేష్‏తో కలిసి రానున్న నందమూరి హీరో ?..

ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షోలో.. ఇప్పుడు టాప్ కంటెస్టెంట్లుగా ఆరుగురు మిగిలారు. శివాజీ, ప్రశాంత్, అమర్ టైటిల్ రేసులో దూసుకుపోతున్నారు. ఇక యావర్ నాలుగో స్థానంలో ఉండగా.. ప్రియాంక, అర్జున్ చివరిస్థానాల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు రెండు రోజులుగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Bigg Boss 7 Telugu: ‘బిగ్‌బాస్’ ఫైనల్‌కు గెస్టులుగా ఆ ఇద్దరు.. మహేష్‏తో కలిసి రానున్న నందమూరి హీరో ?..
Bigg Boss 7, Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 14, 2023 | 8:40 PM

తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపుకు వచ్చేసింది. గత సీజన్ అట్టర్ ప్లాప్ కావడంతో ఈసారి మరింత శ్రద్ధ పెట్టారు. ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే క్యూరియాసిటిని పెంచేశారు. అయితే ఊహించినంతగా ట్విస్టులు ఏం ఇవ్వకపోయిన.. కంటెస్టెంట్స్ సెలక్షన్స్.. ఆట తీరు ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇక ఈసారి నాగార్జున హోస్టింగ్ అదరగొట్టేశారు. ఒక్కొ వారం కంటెస్టెంట్స్ చేసిన పొరపాట్లపై విరుచుకుపడ్డారు. కొన్ని సందర్భాల్లో హోస్టింగ్ పై విమర్శలు వచ్చినప్పటికీ.. ఈసారి సీజన్ 7 మాత్రం హిట్ అయ్యిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షోలో.. ఇప్పుడు టాప్ కంటెస్టెంట్లుగా ఆరుగురు మిగిలారు. శివాజీ, ప్రశాంత్, అమర్ టైటిల్ రేసులో దూసుకుపోతున్నారు. ఇక యావర్ నాలుగో స్థానంలో ఉండగా.. ప్రియాంక, అర్జున్ చివరిస్థానాల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు రెండు రోజులుగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

గ్రాండ్ ఫినాలేకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్ స్టేజ్ పై ఈసారి శ్రీమంతుడు సందడి చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ పేరు తెరపైకి వచ్చింది. మహేష్ బాబుతో కలిసి నందమూరి హీరో సైతం రాబోతున్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ. ఉల్టా పుల్టా అంటూ భారీగా హైప్ తెచ్చిన ఈ షోకు.. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలో మహేష్, బాలకృష్ణ ఇద్దరూ అతిథులుగా రాబోతున్నారని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు.

గతంలో వీరిద్దరు అన్ స్టాపబుల్ స్టేజ్ పై కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో వచ్చిన అన్ స్టాపబుల్ షోకు మహేష్ గెస్టుగా వచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య, మహేష్ కలిసి బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పైకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన పోలింగ్ ప్రకారం పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసులో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇక రెండో స్థానంలో శివాజీ.. మూడవ స్థానంలో యావర్ కొనసాగుతున్నారు. మొన్నటి వరకు టైటిల్ రేసులో రెండవ స్థానంలో ఉన్న అమర్ ఓటింగ్ ఇప్పుడు దారుణంగా పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఓటింగ్ కు ఇంకా ఒకరోజు టైమ్ ఉండడంతో లెక్కలు ఎలా మారుతాయనేది ఊహించడం కష్టమే. ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.