Brahmamudi, December 14th episode: కావ్య, స్వప్న, అప్పూకి పొంచివున్న గండాలు.. ఊహించని రీతిలో ఒకే రోజు ట్విస్టులు!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో దుగ్గిరాల వారి ఇంట్లో అందరూ ఉపవాసాలు మొదలు పెట్టారు. కావ్య పూజ చేసి హారతి ఇచ్చాక.. ఇప్పటి నుంచి సాయంత్రం కోనేటిలో దీపాలు వెలిగించేంత వరకూ ఎవరూ ఏమీ తినకూడదని పెద్దావిడ చెప్తుంది. అలా ఎలా కుదురుతుందని సుభాష్ అంటే.. నాదీ అదే మాట అంటాడు ప్రకాష్. అదేంటి మావయ్య మీ అబ్బాయి చూడండి.. తను కూడా ఉపవాసం ఉంటానని నాకు మాట ఇచ్చారు అని అంటుంది కావ్య. దీనికి షాక్ అవుతాడు రాజ్. అదేంట్రా నువ్వు ఉపవాసం ఉండటం ఏంటి? అని అపర్ణ అడుగుతుంది. ఇక కావాలనే కావ్య..

Brahmamudi, December 14th episode:  కావ్య, స్వప్న, అప్పూకి పొంచివున్న గండాలు.. ఊహించని రీతిలో ఒకే రోజు ట్విస్టులు!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Dec 14, 2023 | 11:06 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో దుగ్గిరాల వారి ఇంట్లో అందరూ ఉపవాసాలు మొదలు పెట్టారు. కావ్య పూజ చేసి హారతి ఇచ్చాక.. ఇప్పటి నుంచి సాయంత్రం కోనేటిలో దీపాలు వెలిగించేంత వరకూ ఎవరూ ఏమీ తినకూడదని పెద్దావిడ చెప్తుంది. అలా ఎలా కుదురుతుందని సుభాష్ అంటే.. నాదీ అదే మాట అంటాడు ప్రకాష్. అదేంటి మావయ్య మీ అబ్బాయి చూడండి.. తను కూడా ఉపవాసం ఉంటానని నాకు మాట ఇచ్చారు అని అంటుంది కావ్య. దీనికి షాక్ అవుతాడు రాజ్. అదేంట్రా నువ్వు ఉపవాసం ఉండటం ఏంటి? అని అపర్ణ అడుగుతుంది. ఇక కావాలనే కావ్య.. రాజ్ ని ఇరికించేస్తుంది. కావ్య ఓవర్ యాక్టింగ్ కి రాజ్ బలి అవుతాడు. ఆ తర్వాత ధాన్య లక్ష్మి సెటైర్లు వేస్తుంది. మేము ఉపవాసం ఉండలేం కానీ తినేవాళ్లంతా నాతో వచ్చేయండి అని అంటాడు సుభాష్. ఆకలితో మెలికలు తిరుగుతాడు రాజ్. కావాలని సుభాష్, ప్రకాష్ ఊరిస్తూ ఉంటారు.

ఉపవాసం ఉంటున్నాడని రాజ్ ని ఇరికించేసిన కావ్య:

ఈ ఉపవాసాలు మీకు పట్టవకు కానీ.. రేయ్ రాజ్ రా నువ్వు కూడా తిందువు అని పిలుస్తాడు. కానీ కావ్య ఒప్పుకోదు. మొత్తానికి రాజ్ ని ఇరికించేస్తుంది. మరోవైపు స్వప్న కూడా ఆకలితో కూర్చుంటుంది. నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావ్.. వెళ్లి తిను అని అంటుంది అపర్ణ. నేను కూడా ఉపవాసం ఉండాలేమో అని స్వప్న అంటే.. ఎవరు చెప్పారు.. కడుపుతో ఉన్నవాళ్లు ఉప వాసం ఉండకూడదని ఇందిరా దేవి చెప్తుంది. అవునా అయితే ఇందకాటి నుంచి ఆకలి వేస్తున్నా తినకుండా కంట్రోల్ చేసుకుంటున్నా.. ఇప్పుడే తింటాను అని వెళ్తుంది స్వప్న.

దొంగ తనంగా ఫ్రూట్స్ తినేస్తున్న రాజ్..

ఇక రాజ్ ఏమో బెడ్ షీట్ వేసుకుని మూలన కూర్చుంటాడు. ఈలోపు గదిలోకి వచ్చిన కావ్య.. ఎక్కడికి వెళ్లారు అని వెతుక్కుంటుంది. అప్పుడే అరటి పండు తొక్క విసిరేస్తాడు రాజ్. ఈ లోపు కావ్య వచ్చి బెడ్ షీట్ తీసేస్తుంది. ఏంటి ఉపవాసం ఉండాలి అన్నాను కదా.. ఇదేనా అని కావ్య అడుగుతుంది. నేను ఉంటానని చెప్పలేదు. నువ్వే నాతో బలవంతంగా కమిట్ చేయించావ్ అని అంటాడు రాజ్. మీరు కూడా ఉపవాసం ఉంటే.. ఆ దేవుడు దయ తలచి మన ఇద్దర్నీ కలుపుతాడని అనుకున్నా.. కానీ అని కావ్య అంటే.. మన ఇద్దర్నీ ఆ దేవుడు కూడా కలపలేడు అని రాజ్ అంటాడు. అక్కడి నుంచి కోపంతో వెళ్లి పోతుంది కావ్య. రాజ్ మాత్రం హ్యాపీగా తింటాడు.

ఇవి కూడా చదవండి

స్వప్న మీద మరో కుట్ర చేయడానికి సిద్ధమైన రాహుల్, రుద్రాణిలు..

స్వప్న మీద మరో కుట్ర చేయడానికి రాహుల్, రుద్రాణి సిద్ధం అవుతారు. ఇప్పుడు నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. మూడు నెలలు వెయిట్ చేసి.. డీఎన్ ఏ టెస్ట్ చేసే వరకూ వెయిట్ చేయాల్సిందే అని రుద్రాణి అంటే.. అలా అనకు మమ్మీ ఏదో ఒక దారి ఉంటుంది కదా.. ఆలోచించు అని రాహుల్ అడుగుతాడు. ఒక దారి ఉంది కానీ అది చేస్తే.. నువ్వు దొరికి పోయే ప్రమాదం ఉందని రుద్రాణి అంటుంది. ఏంటి మమ్మీ అది.. ఆ స్వప్నని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడానికి ఏమైనా చేస్తాను అని అంటాడు రాహుల్. సాయంత్రం గుడి దగ్గరకు అరుణ్ ని రమ్మని చెప్పు. ఫ్యామిలీ ఎవరికీ కనిపించకుండా.. స్వప్నకి మాత్రమే కనిపించేలా చేయి. అప్పుడు అరుణ్ ని చూసిన స్వప్న వాడి కోసం పరిగెడుతుంది. వాడిని పట్టుకోవాలని ట్రై చేస్తుంది. అలా వెళ్తూ అది కోనేటి దగ్గరకు వచ్చేసరికి దాడి పడేసి.. మిస్ క్యారీ అయిందని చెప్పాలి. ఈ సారి ఈ ప్లాన్ పక్కాగా జరిగేలా అమలు చేయ్. లేదంటే మనకే ప్రమాదం అని రుద్రాణి అంటుంది. అలా జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్తాడు రాహుల్.

రాజ్ కి శ్వేత కాల్.. గుడి దగ్గర కలుస్తానని చెప్పిన శ్వేత..

మళ్లీ ఆకలితో అలమటిస్తూ కావ్యని తిట్టుకుంటాడు రాజ్. అప్పుడే శ్వేత కాల్ చేస్తుంది. వెంటనే డోర్ వేసి వచ్చి కాల్ మాట్లాడతాడు రాజ్. ఇవాళ కలుద్దాం అని చెప్పావుగా.. ఫోన్ చేయలేదేంటి అని అని శ్వేత అంటుంది. అవును కానీ సడెన్ గా గుడి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. సారీ శ్వేత కలవడానికి కుదరదు అని చెప్తాడు రాజ్. ఎక్కడి గుడికి వెళ్తున్నారు అని శ్వేత అడిగితే.. శివాలయం.. ఎప్పుడూ వెళ్లేదే అని చెప్తాడు రాజ్. సరే అయితే నేను గుడికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శ్వేత. అంత మందిలో శ్వేతను ఎలా కలవాలి? ఎవరైనా చూస్తే అని ఆలోచనలో పడతాడు రాజ్.

ప్లాన్ ప్రకారం గుడికి వచ్చిన అనామిక ఫ్యామిలీ..

ఆ తర్వాత అందరూ గుడికి వస్తారు. సరిగ్గా అప్పుడే అనామిక వాళ్లు కూడా వస్తారు. ఇదేంటి సడెన్ గా సర్ ప్రైజ్ ఇచ్చారని అడుగుతుంది ధాన్య లక్ష్మి. ఏం చేయాలి వదినా.. జాతక దోషాల్లో ఉండే అడ్డంకులు పోవాలని పెళ్లి సవ్యంగా జరగాలని కోనేటిలో దీపం వదిలే వరకూ మా అనామిక ఉపవాసం ఉంటానని మొక్కుకుందని చెప్తుంది శైలు. అంతా బాగానే ఉంది కానీ సరిగ్గా ఇదే గుడికి రావాలని ఎందుకు అనిపించింది అనామిక.. ఇందులో ఏదో గూడుపుటాని ఉందని కావ్య అంటే.. ఇంకేం ఉంటుందే అంతా కళ్యాణ్ ప్లానే అని స్వప్న అంటుంది. హో మన కవిగారు మేఘ సందేశం పంపించారు అన్న మాట అని కావ్య అంటుంది. ఇక రాజ్ కావ్యని ఆట పట్టిస్తుంది. ఇక అదే సమయంలో అప్పూ, వాళ్ల నాన్న కృష్ణ మూర్తిలు కూడా వస్తారు. నాన్నా ఇంకో సర్ ప్రైజా అని కావ్య వాళ్ల దగ్గరకు వెళ్తుంది.

నీ సవతిలాగా ప్రతి చోటకీ దాపరిస్తుందేంటి.. అప్పూపై శైలు సీరియస్:

ఇదేంటే.. నీ సవతిలాగా ప్రతి చోటకీ దాపరిస్తుందని శైలు అంటే.. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ మమ్మీ అని అనామిక అంటుంది. ఫ్రెండ్ అయినా అమ్మాయే కదా అని శైలు అంటే.. ఎందుకైనా మంచిది ఓ కంట కనిపెడుతూ ఉండమ్మా అని తండ్రి సుబ్రమణ్యం అంటాడు. నాకు కొంచెం అసూయగానే ఉందమ్మా.. నాకంటే తనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని అనామిక అంటే.. నేను చూసుకుంటాను కదా నువ్వేం వర్రీ అవ్వకు అని శైలూ అంటుంది. అప్పూని చూడగానే హాయ్ బ్రో అని కళ్యాణ్.. వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తే.. వెంటనే వచ్చి అనామిక అడ్డుకుంటుంది. నేను ముందు వచ్చాను నన్ను పలకరించవా.. ఇక నుంచి నువ్వు నా పక్కనే ఉండాలి కళ్యాణ్ అని అంటుంది అ నామిక.

టైమ్ చూసి కావ్యని ఇరికించిన రాజ్..

సరే ఇక అందరూ రండి.. దర్శనం చేసుకుందాం అని అంటుంది అపర్ణ. మమ్మీ మీరందరూ వెళ్లి దర్శనం చేసుకోండి. కళావతి ఇప్పుడప్పుడే రాదని అంటాడు రాజ్. ఎందుకు రా అని అడుగుతుంది పెద్దా. కళ్యాణ్ పెళ్లి కోసం నాటిన మొక్క పచ్చగా ఉంటే గుడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసుకుంటానని మొక్కుకుంది నానమ్మా అని ఇరికించేస్తాడు రాజ్. అదేంటమ్మా.. ఉపవాసం ఉండి అన్ని ప్రదక్షిణలు ఎలా చేస్తావ్ అని ఇందిరా దేవి అంటుంది. రా కళావతి.. అని పిలుస్తాడు రాజ్.

గుడిలో ట్విస్టుల మీద ట్విస్టులు..

అక్కడ వాళ్లు ఏం చేస్తున్నారు.. అని అడుగుతుంది అనామిక. మనసులో ఏదైనా ఉంటే దేవుడిని తలుచుకుని ఆ కాయిన్ నిలబెడతారు. అది నిలబడితే ఆ కోరిక జరుగుతుందని నమ్మకం అని ప్రకాష్ అంటాడు. అవి నిలబెడదాం అని అనామిక, స్వప్న అనుకుంటారు. స్వప్న వెళ్లి రాహుల్ ని అడిగితే.. అవి గుడి బయట అడుక్కునే వాళ్ల దగ్గర ఉంటాయని చెప్తే.. అందుకే నిన్ను అడిగాను అని చెప్తుంది స్వప్న. ఆ తర్వాత అందరూ కలిసి గుడిలోకి వెళ్తారు. అంతా మనం అనుకున్నట్టే ప్లాన్ జరగాలని రుద్రాణి, రాహుల్ లు ప్లాన్ వేస్తారు. ఈలోపు అరుణ్ గుడిలోకి ఎంటర్ అవుతాడు. ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.