Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ పక్కా.. బయటకు వెళ్లేది ఎవరంటే?

బుధవారం (డిసెంబర్‌ 13) పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌ బిగ్‌ బాస్‌ ప్రయాణాన్ని ఆడియెన్స్‌కు చూపించారు. ఈ జర్నీ వీడియోలతో కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే గ్రాండ్‌ ఫినాలేకు ముందు మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ ఉండనుందని తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ పక్కా.. బయటకు వెళ్లేది ఎవరంటే?
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2023 | 6:16 PM

సుమారు వంద రోజులుగా బుల్లితెర ఆడియెన్స్‌ను అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ రియాలిటీ షో ముగింపునకు వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో ఈ సెలబ్రిటీ గేమ్ షోకు శుభం కార్డు పడనుంది. ఆదివారం (డిసెంబర్‌ 17)న జరిగే గ్రాండ్‌ ఫినాలేలో బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ టైటిల్‌ విజేత ఎవరో తేలనుంది. 14 వారంలో శోభాశెట్టి ఎలిమినేట్‌ ఇక ఆరుగురు కంటెస్టెంట్స్‌ మాత్రమే హౌజ్‌లో మిగిలారు. ప్రస్తుతం ఫైనలిస్టుల జర్నీని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ చివరి వారాన్ని పూర్తి ఎమోషనల్‌గా మార్చేస్తున్నాడు బిగ్‌ బాస్‌. మొదటి రోజు అంబటి అర్జున్‌, అమర్ దీప్‌ వీడియోలను చూపించారు. దీంతో వీరి ఓటింగ్‌ కూడా భారీగా పెరిగింది. ఇక రెండో రోజు శివాజీ, ప్రియాంక ఎమోషనల్‌ జర్నీని కూడా చూపించారు. బుధవారం (డిసెంబర్‌ 13) పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌ బిగ్‌ బాస్‌ ప్రయాణాన్ని ఆడియెన్స్‌కు చూపించారు. ఈ జర్నీ వీడియోలతో కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే గ్రాండ్‌ ఫినాలేకు ముందు మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటివరకు హౌజ్‌ మేట్స్‌ జర్నీ వీడియోలతోఎమోషనల్‌గా మారిపోయిన వీక్‌లో సడెన్‌ ట్విస్ట్‌ను ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. అందుకే మిడ్‌ వీక్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇదే కనుక కన్ఫార్మ్ అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇక బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే పేరుతో రెండు వారాల ముందు నుంచే ఓటింగ్ ప్రారంభించారు. ఇందులో మొదటి నుంచి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్‌లో దూసుకెళుతున్నాడు. రెండో స్థానంలో శివాజి, మూడో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడు. ఇదే ట్రెండ్ కొనసాగితే టాప్‌-3లో వీరే ఉండచ్చునని తెలుస్తోంది. ఇక నాలుగో స్థానంలో ప్రిన్స్‌ యావర్‌ ఉన్నాడు. టాప్‌-5లో అంబటి అర్జున్‌, ఆరో స్థానంలో ప్రియాంక జైన్‌ ఉన్నారు. అంటే తక్కువ ఓట్లు ఉన్న ప్రియాంక జైన్‌ ఈ వారం మధ్యలో ఎలిమినేట్‌ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఫైనల్‌కు కనీసం ఒక అమ్మాయైనా వెళ్లాలని భావిస్తే మాత్రం ప్రిన్స్‌ యావర్‌, అంబటి అర్జున్‌లలో ఒకరు హౌజ్‌ నుంచి బయటకు రాక తప్పదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇవి కూడా చదవండి

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ జర్నీ.. ఎమోషనల్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..