AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఫైనలిస్ట్‏లకు ఇంటి ఫుడ్ తెప్పించిన బిగ్‏బాస్.. కానీ అసలు ఫిటింగ్ ఇదే.. 

నిన్నటి వరకు జర్నీ వీడియోలను ఎమోషనల్‎గా సాగింది. ప్రస్తుతం హౌస్ లో మిగిలిన ఆరుగురిలో ఒకరు విన్నర్ కాబోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ ప్రకారం అత్యధిక ఓటింగ్ తో పల్లవి ప్రశాంత్ టాప్ 1 స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో శివాజీ, మూడవ స్థానంలో అమర్ దీప్, నాల్గవ స్థానంలో యావర్ ఉన్నారు. ఇక అర్జున్, ప్రియాంకకు అందరి కంటే తక్కువ ఓటింగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూడు రోజులలో హౌస్మేట్స్ కోసం స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు బిగ్‏బాస్.

Bigg Boss 7 Telugu: ఫైనలిస్ట్‏లకు ఇంటి ఫుడ్ తెప్పించిన బిగ్‏బాస్.. కానీ అసలు ఫిటింగ్ ఇదే.. 
Bigg Boss 7 Telugu
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2023 | 2:52 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. చివరి నామినేషన్స్‏లోనూ కొట్టుకున్నంత పనిచేసిన కంటెస్టెంట్స్ ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. ఇక ఈ వారం హౌస్ లో మిగిలిన టాప్ 6 కంటెస్టెంట్స్ బిగ్‏బాస్ జర్నీ వీడియోలను చూపించిన సంగతి తెలిసిందే. శివాజీ, అమర్, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక తమ బిగ్‏బాస్ జర్నీ వీడియోలను చూస్తూ భావోద్వేగానికి గూరయ్యారు. నిన్నటి వరకు జర్నీ వీడియోలను ఎమోషనల్‎గా సాగింది. ప్రస్తుతం హౌస్ లో మిగిలిన ఆరుగురిలో ఒకరు విన్నర్ కాబోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ ప్రకారం అత్యధిక ఓటింగ్ తో పల్లవి ప్రశాంత్ టాప్ 1 స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో శివాజీ, మూడవ స్థానంలో అమర్ దీప్, నాల్గవ స్థానంలో యావర్ ఉన్నారు. ఇక అర్జున్, ప్రియాంకకు అందరి కంటే తక్కువ ఓటింగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూడు రోజులలో హౌస్మేట్స్ కోసం స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు బిగ్‏బాస్.

తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే.. హౌస్ మెట్స్ కోసం ఇంటిఫుడ్ తెప్పించాడు బిగ్‏బాస్. ఒక్కొక్కరికి తమకు ఇష్టమైన ఫుడ్ ఇచ్చేందుకు అసలైన ఫిటింగ్ పెట్టాడు. ఈ పదిహేను వారాల జర్నీలో ఎవరు ఏ టాస్కులో ఓడిపోయారో మళ్లీ అదే టాస్క్ ను పెట్టి అందులో విజయం సాధిస్తే ఇంటి ఫుడ్ లభిస్తుందని మెలిక పెట్టారు బిగ్‏బాస్. అయితే ఇక్కడ సైతం ట్విస్ట్ ఇచ్చాడు. ఎవరి ఫుడ్ కోసం వాళ్లు టాస్కులు ఆడకూడదు. వేరే వాళ్ల కోసం టాస్కులు ఆడి గెలిచి.. వారికి ఇంటి భోజనం అందించాలి. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో.. అర్జున్ కోసం వచ్చిన ఫుడ్ అందించాలంటే.. యావర్ టాస్కు గెలవాల్సిందే. ఎవిక్షన్ పాస్ గెలిచే సమయంలో బ్యాలెన్స్ బాల్ టాస్కునే ఇప్పుడు మరోసారి యావర్ కు ఇచ్చారు. ఇక టాస్కు గెలిచి అర్జున్ కు ఫుడ్ అందించాడు యావర్.

ఆ తర్వాత శివాజీ కోసం వచ్చిన ఫుడ్ అందించేందుకు ప్రియాంక టాస్కులు గెలవాల్సి ఉంటుంది. ఇక తన టాస్కులోనూ ప్రియాంక గెలిచి శివాజీకి ఫుడ్ అందించింది. ఆ తర్వాత అమర్ కోసం శివాజీ బెలూన్స్ టాస్క్ ఆడాల్సి ఉంది. అయితే మూడు నిమిషాల్లో అన్ని బెలూన్స్ పగలగొట్టాలి. శివాజీ గెలిచాడో లేదో అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు వినిపిస్తున్న టాక్ ప్రకారం బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నారట. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
నంద్యాల జిల్లాలో ఘోరప్రమాదం.. కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. స్పాట్‌లోనే..
నంద్యాల జిల్లాలో ఘోరప్రమాదం.. కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. స్పాట్‌లోనే..
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!
3 కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి!
3 కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి!
కుర్రాళ్ళ మతిపోగొడుతున్న కృతిశెట్టి
కుర్రాళ్ళ మతిపోగొడుతున్న కృతిశెట్టి
యాక్షన్ సినిమాలకు కాలం చెల్లిందా? టాలీవుడ్‌ తెరపై మళ్లీ కామెడీ
యాక్షన్ సినిమాలకు కాలం చెల్లిందా? టాలీవుడ్‌ తెరపై మళ్లీ కామెడీ