AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వావ్.. ఆ రాశి వారికి వాహన యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope in Telugu: ఫిబ్రవరి 13, 2026 శుక్రవారం రోజున మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. వృషభ రాశి వారికి అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ లాభాలు కలుగుతాయి. మిథున రాశి వారికి పదోన్నతి లేదా జీతవృద్ధి వంటి శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇలా మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు రాశిఫలాలు వివిధ విధాలుగా అనుకూలంగా కనిపిస్తున్నాయి.

Horoscope Today: వావ్.. ఆ రాశి వారికి వాహన యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 13 Feb 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 13, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 13, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగం మారడా నికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమాధిక్యత ఉన్నా ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి. కొన్ని ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మిత్రులలో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. పెండింగు పనులు పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు మిత్రులు మిమ్మల్ని సొంత పనులకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆస్తి విషయాలు కొద్దిగా చికాకు పెడతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకులనుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వాహన యోగం కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. స్థాన చలన సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్య మైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తోబుట్టు వులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. విలాస జీవితం అనుభవిస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా గడుపుతారు. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. జీవిత భాగస్వామిని సంప్రదించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగుల మీద అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు, సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయంతో సమానంగా అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి శు‍భవార్త వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు కానీ, శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల మీద వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. బంధువులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇతరుల బాధ్యతలను మీరు మోయడం మంచిది కాదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం పొందుతారు. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా, ముఖ్యమైన వ్యవహారాల్ని విజయవంతంగా చక్కబెడతారు. ప్రయాణాలు లాభిస్తాయి.