Bigg Boss 7 Telugu: గంటలో ఎవరీ స్క్రీన్ స్పేస్ ఎక్కువ.. అమర్‌కు మళ్లీ కౌంటరిచ్చిన శివాజీ..
తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మీ 14 వారాల జర్నీ తర్వాత మీ ఓవరాల్ పెర్ఫామెన్స్ ఆధారంగా 60 నిమిషాల ఒక ఎపిసోడ్ లో మీరు ఎంత సేపు కనిపించడానికి అర్హులని భావిస్తున్నారో చెప్పాలి అన్నాడు. ఒక్కొక్కరికి మీరు అనుకున్న టైమ్ కార్డ్ ఇచ్చి అందుకు తగిన కారణాలు చెప్పాలని సూచించాడు. అయితే ముందుగా అర్జున్ తనకు పది నిమిషాల టైమ్ బోర్డు తీసుకున్నాడు. మొత్తం 60 నిమిషాల్లో 10 నిమిషాలు కనిపించవచ్చు అనుకున్నట్లు చెప్పాడు. ఇక తర్వాత శివాజీ.. కేవలం మూడు నిమిషాలే అన్న టైమ్ కార్డ్ అమర్ కు ఇచ్చాడు.
బిగ్‌బాస్ సీజన్ 7 తుది దశకు చేరుకుంది. గత సీజన్లకు మించి ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సీజన్ 7 విన్నర్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అమర్, శివాజీ, ప్రశాంత్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కేవలం అత్యల్ప ఓటింగ్ తేడాతో ఈ ముగ్గురు టైటిల్ రేసులో దూసుకుపోతున్నారు. ఇక ఈ వారం హౌస్ మొత్తం కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలతో ఎమోషనల్‌గా సాగింది. అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, ప్రియాంక, అర్జున్..ఆరుగురి ఇంటి సభ్యుల జర్నీ వీడియోస్ చూపించిన బిగ్‌బాస్.. ఈరోజు కంటెస్టెంట్లకు ఇంటి భోజనం అందించనున్నారు. అయితే హోం ఫుడ్ కావాలంటే.. టాస్కులలో గెలిచి తీరాల్సిందేనని ఫిటింగ్ పెట్టాడు. అది కూడా ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా టాస్కులు పెట్టి ఆడించాడు బిగ్‌బాస్. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం అదిరింది. ఎప్పటిలాగే అమర్, శివాజీ కామెడీ టైమింగ్ నవ్వులు తెప్పిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఆరుగురు ఫైనలిస్ట్స్ ప్రశాంతంగా ఉన్నారు. ఇక వారి మధ్య చిన్న డిస్కషన్ పెట్టేందుకు ట్రై చేశాడు బిగ్‌బాస్.
తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మీ 14 వారాల జర్నీ తర్వాత మీ ఓవరాల్ పెర్ఫామెన్స్ ఆధారంగా 60 నిమిషాల ఒక ఎపిసోడ్ లో మీరు ఎంత సేపు కనిపించడానికి అర్హులని భావిస్తున్నారో చెప్పాలి అన్నాడు. ఒక్కొక్కరికి మీరు అనుకున్న టైమ్ కార్డ్ ఇచ్చి అందుకు తగిన కారణాలు చెప్పాలని సూచించాడు. అయితే ముందుగా అర్జున్ తనకు పది నిమిషాల టైమ్ బోర్డు తీసుకున్నాడు. మొత్తం 60 నిమిషాల్లో 10 నిమిషాలు కనిపించవచ్చు అనుకున్నట్లు చెప్పాడు. ఇక తర్వాత శివాజీ.. కేవలం మూడు నిమిషాలే అన్న టైమ్ కార్డ్ అమర్ కు ఇచ్చాడు. దీంతో నేను 3 నిమిషాల టైమ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నానన్నాడు అమర్. అలాగే శివాజీ మెడలో 20 నిమిషాల కార్డ్ వేసింది ప్రియాంక.
ఆ తర్వాత అర్జున్ కు 3 నిమిషాల కార్డ్ ఇచ్చాడు అమర్. ప్రశాంత్ శివాజీ ఒకరికొకరు 20 నిమిషాల కార్డ్స్ ఇచ్చుకున్నారు. ప్రియాంకకు పది నిమిషాల కార్డ్ ఇచ్చాడు శివాజీ. యావర్ సైతం 3 నిమిషాల కార్డ్ అమర్ కు ఇచ్చాడు. దీంతో నేను 3 నిమిషాలే కనబడతానా అని అన్నాడు. ఇక చివరగా..అర్జున్ 20 నిమిషాల టైమ్ కార్డును అమర్ కు వేయడంతో అందరికీ నమస్కరించాడు అమర్. దీంతో ఎందుకురా నీకు 20 నిమిషాలు నాకు అర్థం కాలేదంటూ కౌంటరిచ్చాడు శివాజీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.