AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Bebakka: కోకాపేటలో కొత్తిల్లు కొన్న బెజవాడ బేబక్క.. గృహ ప్రవేశానికి తరలివచ్చిన సెలబ్రిటీలు.. వీడియో

బెజవాడ బేబక్క.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీషోతో ఫేమస్ అయిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్. బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. అయితే తాజాగా ఆమె ఏకంగా కోకా పేటలో కొత్త ఇల్లు కొనేసింది.

Bigg Boss Bebakka: కోకాపేటలో కొత్తిల్లు కొన్న బెజవాడ బేబక్క.. గృహ ప్రవేశానికి తరలివచ్చిన సెలబ్రిటీలు.. వీడియో
Bigg Boss Bebakka
Basha Shek
|

Updated on: Aug 17, 2025 | 3:32 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ బెజవాడ బేబక్క కొత్తిల్లు కొనుగోలు చేసింది. హైదరాబాద్ లోని కోకాపేట ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ కొనుక్కుంది. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఇంటి గృహప్రవేశానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వీడియోను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ‘నేను ఎప్పటినుంచో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. ఇన్నాళ్లకు సొంతింటి కల సాకారం అయింది. నా ఇంటి గృహప్రవేశానికి అమ్మ ముఖ్య అతిథి’ అంటూ బేబక్క షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అభిమానులు బేబక్కకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బెజవాడ బేబక్క గృహప్రవేశ వేడుకకు హీరో శ్రీకాంత్‌, నటి జ్యోతి సహా పలువురు వెండితెర, బుల్లితెర ప్రముఖులు హాజరయ్యారు. కాగా అపార్ట్‌మెంట్‌లో 25వ అంతస్థులో ఉన్న ఫ్లాట్‌నే తన ఇంటిగా ఎంపిక చేసుకుంది బేబక్క. ఇందులో మూడు బెడ్‌రూమ్స్‌ ఉన్నాయి. ఈ ఇంట్లో పిల్లి ఆడుకోవడం కోసం ఒక గోడను డిఫరెంట్‌గా డిజైన్‌ చేయించింది. అలాగే పూజ గదిని కూడా నీట్‌గా, అందంగా కట్టించుకుంది.

ఇవి కూడా చదవండి

బేబక్క ఇన్ స్టాలో  షేర్ చేసిన వీడియో..

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకున్న బేబక్క యూఎస్‌లోనే పుట్టి పెరిగారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి.. సహాయక నటిగా స్థిర పడింది. మీలో ఎవరు కోటీశ్వరుడు, 24 కిస్సెస్, ఏబీసీడీ, అందరు బాగుండాలి అందులో నేనుండాలి తదితర చిత్రాల్లో నటించింది. ఇక కరోనా సమయంలో బెజవాడ బేబక్క యూట్యూబ్ వీడియోలు, రీల్స్‌ నెట్టింట బాగా వైరలయ్యాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. అయితే మొదటి వారమే ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో పాల్గొంటోంది.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే బేబక్కకు నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆమె ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

View this post on Instagram

A post shared by B Naveen Kumar (@abhaai.br)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం