Bigg Boss: సినిమా ఇండస్ట్రీలో మరోసారి కాల్పుల కలకలం.. బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై బుల్లెట్ల వర్షం
బిగ్ బాస్ విజేత, ప్రముఖ యూట్యూబర్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆదివారం (ఆగస్టు 17) తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు బైక్‌లపై వచ్చి యూట్యూబర్ ఇంటిపై దాదాపు 24 రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్ల శబ్దంతో ఆ ప్రాంతమంతా భయాందోళన నెలకొంది. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ హిందీ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిగాయి. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం (ఆగస్టు 17) తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు బైక్‌లపై వచ్చి గురుగ్రామ్‌లోని సెక్టార్ 56లోని ఎల్విష్ ఇంటిపై దాదాపు 24 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడు. ఆ సమయంలో కేర్ టేకర్ మాత్రమే ఇంట్లో ఉన్నాడు. కాల్పుల గురించి అతనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఈ ఘటనపై ఎల్విష్ ఇంకా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కాల్పుల సంఘటన ఆదివారం ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య జరిగింది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గురుగ్రామ్‌లోని ఎల్విష్ ఇంటికి ఫోరెన్సిక్ బృందాన్ని కూడా పిలిపించారు. ప్రాథమిక ఆధారాలను సేకరించడానికి ఆ బృందం అక్కడికి చేరుకుంది. ప్రాథమిక దర్యాప్తులో ఎల్విష్‌ను బెదిరించడానికి కాల్పులు జరిగి ఉండవచ్చని తేలింది. అయితే, నేరస్థులను ఇంకా గుర్తించలేదు. ఈ సంఘటన తర్వాత, ఎల్విష్ గురించి అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎల్విష్ లేదా అతని కుటుంబం నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఎల్విష్ ఇంటి చుట్టూ ఉన్న సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఎల్విష్ ఫిర్యాదు చేస్తే, దర్యాప్తు మరింత ముమ్మరం కావచ్చు.
యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ‘బిగ్ బాస్ OTT 2’ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ షో గెలిచినప్పటి నుంచి అతను వివిధ కారణాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. బిగ్ బాస్ తర్వాత అతనికి ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బిగ్ బాస్ టైటిల్ గెల్చిన తర్వాత ఎల్విష్ కు మ్యూజిక్ వీడియోల నుంచి సినిమాల వరకు అనేక ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్ ఊర్వశి రౌతేలాతో కలిసి ఒక మ్యూజిక్ వీడియోలో కూడా నటించాడు. అలాగే దుబాయ్‌లో ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కొనుగోలు చేశాడు.
సీసీటీవీ పుటేజ్ వీడియో ఇదిగో..
CCTV video of those who attacked Elvish Yadav’s house surfaced, miscreants were seen riding a bike pic.twitter.com/qIYDRXidL5
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 17, 2025
🚨 Firing at Elvish Yadav’s Gurugram Residence 🚨
Early Sunday morning, three bike-borne attackers opened fire outside the house of YouTuber & Bigg Boss OTT winner Elvish Yadav.
The incident took place between 5:30–6 AM, with assailants firing 12+ rounds before fleeing.… pic.twitter.com/o7bn5iTAnE
— Greater Noida West (@GreaterNoidaW) August 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








