Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ హౌస్‌లోకి రాకుండానే.. అగ్ని పరీక్ష నుంచి ఆ దివ్యాంగుడు ఎలిమినేట్ అయ్యాడా?
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు త్వరలోనే మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ ఆగస్టు 22వ తేదీ నుంచి ప్రారంభం కావొచ్చనే తెలుస్తోంది. ఇప్పటికే కొత్త సీజన్ పై వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. సెలబ్రిటీలతో పాటు సామాన్య జనాలకు కూడా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నే బిగ్‌బాస్ అగ్నిపరీక్ష అంటూ సరికొత్త కాంటెస్ట్ ను ప్రకటించారు. ఇందుకు సుమారు 20 వేల మంది దరఖాస్తు చేసుకోగా దశలవారీగా వారిని ఫిల్టర్ చేసి చివరకు 45 మందిని ఎంపిక చేశారు. వీరికి అగ్నిపరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కనీసం ఐదుగురిని బిగ్‌బాస్ 9వ సీజన్ కు ఎంపిక చేయనున్నారు. కాగా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చాలా మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు కనిపించారు. గంగవ్వ వయసులో ఉన్న మహిళ, మాస్క్ మ్యాన్, తెలంగాణకు చెందిన అనూష రత్నం.. ఇలా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నారు. అయితే వీరందరిలో ఆసక్తి రేకత్తించిన వ్యక్తి ప్రసన్న కుమార్.
దివ్యాంగుడైన ప్రసన్న కుమార్ ఫోటోగ్రాఫర్ మాత్రమే కాదు ట్రావెలర్, బైక్ రైడర్, లెక్చరర్ కూడా! మారథాన్‌లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. గతంలో ఆహా అన్ స్టాపబుల్ విత్ NBK షో లో బాలయ్య స్వయంగా ప్రసన్న కుమార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించాడు కూడా. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ షోలో అడుగు పెడితే చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుదందని బిగ్ బాస్ అభిమానులు భావించారు. అయితేఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ప్రసన్నకుమార్ ఎలిమినేట్ అయ్యాడట!
బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో..
45 Raw Rebels ⚡ 3 Grand Masters 👑 1 Agnipariksha 🔥 One battle for survival. One shot at glory! 💪
The BIGG before the BIGGEST… #Biggboss9Agnipariksha starts from Aug 22nd to Sep 5th exclusively on #JioHotstar#BiggbossTelugu9 #Biggboss9Agnipariksha pic.twitter.com/zaPVWEY7nP
— Starmaa (@StarMaa) August 17, 2025
ప్రసన్న కుమార్ తో పాటు శ్వేతాశెట్టి అనే అమ్మాయి కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అయినట్లు నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి బిగ్ బాస్ ఆడియెన్స్ నిరాశ చెందుతున్నారు. ప్రసన్న కుమార్‌ను కనీసం బిగ్‌బాస్ హౌస్ వరకైనా పంపించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రసన్న నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే
అగ్ని పరీక్ష కాంటెస్ట్ లో ప్రసన్న కుమార్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








