AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : ఆయన పిలిస్తే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేస్తా.. రీతూ చౌదరీ కామెంట్స్..

బుల్లితెరపై పలు షోలతో జనాలకు దగ్గరయ్యింది రీతూ చౌదరీ. అలాగే పలు వివాదాలతోనూ తెగ ఫేమస్ అయ్యింది. దీతో అదే పాపులారిటీతో హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇందులోనూ డీమాన్ పవన్ తో స్నేహం అంటూ నెట్టింట ఆమె పేరు మారుమోగేలా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Bigg Boss 9 Telugu : ఆయన పిలిస్తే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేస్తా.. రీతూ చౌదరీ కామెంట్స్..
Rithu Chowdary
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2025 | 9:25 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9.. మరో నాలుగు వారాల్లో పూర్తి కానుంది. ఇప్పుడు టైటిల్ విన్నర్ రేసులో తనూజ దూసుకుపోతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డీమాన్, రీతూ ఉండగా.. తన ఆట తీరు, ప్రవర్తనతో నెగిటివిటీని మూటగట్టుకుంటుంది దివ్య నిఖిత. నిజానికి ఈ వారం ఆమెకు తక్కువ ఓటింగ్ రాగా.. నిఖిల్, గౌరవ్ ఇద్దరినీ ఎలిమినేట్ చేశారు. ఇక ఇందులో రీతూ చౌదరి గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే బుల్లితెరపై చాలా పాపులర్. షోలు, వివాదాలతో నిత్యం వార్తలలో నిలిచింది. ఇప్పుడు బిగ్ బాస్ షోలో తన ఆట తీరుతో నెట్టుకోస్తుంది. ఇదెలా ఉంటే.. తాజాగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో రీతూ చౌదరీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎప్పటిలాగే మాస్ అండ్ స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఈసారి నాగ్ తోపాటు స్టేజ్ పైకి నాగ చైతన్య సైతం వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలోనే ‘‘నాకు యాక్టింగ్‌తో పాటు రేసింగ్ అంటే బాగా ఇష్టమని మీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఓ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది. అందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌కి నేనే ఓనర్‌ను నేను” అంటూ నాగచైతన్య చెప్పడంతో నాగార్జున రియాక్ట్ అయ్యారు. నాకు తెలియకుండా ఎప్పుడు చేశావని అడగ్గా.. చేశానులే అని అన్నాడు చైతూ. ఇక తర్వాత హౌస్మేట్స్ అందరికీ పరిచయం చేశారు.

చైతూను చూడగానే రీతూ మాట్లాడుతూ.. “మీరంటే పిచ్చి నాకు ” అని చెప్పింది. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. నేనంటే ఇష్టమని అన్నావు గా అని అనడంతో.. ఎప్పటికీ మీరు మీరే సార్ అని చెప్పింది. చైతూలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పమని నాగ్ అడగ్గా.. చైతూ సార్ కాళ్లు ఉంటాయ్ సార్.. ఎంత తెల్లగా ఉంటాయో.. శిల్పాన్ని చెక్కినట్లుగా ఉంటారు అని రీతూ చెప్పడంతో.. ఆ శిల్పాన్ని చెక్కింది నేనే అంటూ పంచ్ వేశారు నాగ్.

ఆ తర్వాత నాగ్ మాట్లాడుతూ.. నిన్ను బైక్ మీద తీసుకుని వెళ్తాడని అనడంతో.. వెంటనే నేను వచ్చేస్తాను.. ఆయన కోసం ఎలిమినేట్ అయి ఇంట్లోంచి బయటకు వచ్చేయడానికి సైతం ఓకే అని చెప్పేసింది. దీంతో.. చైతూ మాట్లాడుతూ..నువ్వు గెలిచినా కూడా తర్వాత నిన్ను బైక్ మీద తీసుకెళ్తా అని అనడంతో సంతోషంతో పొంగిపోయింది.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు