AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : నీకో దండం తల్లి.. ఒక్క మాటతో నాగార్జునకే షాకిచ్చిన తనూజ.. నెట్టింట ఏకిపారేస్తున్న నెటిజన్స్..

తనూజ గౌడ.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో టైటిల్ రేసులో ముందున్న కంటెస్టెంట్. మొదటి నుంచి ఆమె పై సోషల్ మీడియాలో అటు నెగిటివిటీ.. ఇటు పాజిటివిటీ రెండు సమానంగానే వస్తున్నాయి. మొదట్లో తన అమాయకత్వం, అందంతో కట్టిపడేసిన తనూజ.. ఇప్పుడు మాట తీరుతో కప్పుకు దూరమవుతుంది. తాజాగా మరోసారి నోరు జారీ అభిమానులకు కోపం తెప్పించింది.

Bigg Boss 9 Telugu : నీకో దండం తల్లి.. ఒక్క మాటతో నాగార్జునకే షాకిచ్చిన తనూజ.. నెట్టింట ఏకిపారేస్తున్న నెటిజన్స్..
Thanuja
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2025 | 8:13 PM

Share

బిగ్‌బాస్ సీజన్ 9.. ఈసారి టైటిల్ రేసులో ముందున్న కంటెస్టెంట్ తనూజ గౌడ. మొదటి నాలుగైదు వారాల్లో తన ఆట తీరుతోపాటు అందంతో జనాలను కట్టిపడేసింది. ఇమ్మాన్యుయేల్, తనూజ బాండింగ్, స్నేహానికి.. కామెడీ టైమింగ్ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. కానీ వీరిద్దరు ఇప్పుడు హౌస్ లో స్నేహితులు కాదు.. శత్రువులుగా మారారు. ఇదెలా ఉంటే.. మొదటి నుంచి తనూజ బాండింగ్స్ పెంచుకుని.. గేమ్స్ ఆడుతుందని.. టాస్కులలోనూ అంతగా పర్ఫార్మెన్స్ చేయకపోయినప్పటికీ వాదనకు దిగుతుందంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు తనూజ నోరు జారింది. శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున అడిగిన ప్రశ్నకు డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే.

శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున అందరినీ ఒక కొశ్చన్ అడిగారు. హౌస్‌లో మీకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉండే ఒకరి పేరు చెప్పండని అడగ్గా.. తనూజ.. మాట్లాడుతూ.. నాకు అలాంటి వాళ్లు ఎవరూ లేరని చెప్పింది. దీంతో నాగార్జునతోపాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. ఎందుకంటే .. ముందు నుంచి భరణి, ఇమ్మాన్యుయేల్, రీతూ, సంజన, నిఖిల్, కళ్యాణ్ ఇలా దాదాపు హౌస్మేట్స్ అందరూ ఆమెకు సహయం చేసినవాళ్లే. కానీ నాకు సపోర్ట్ లేరంటూ తనూజ చెప్పడంతో అవాక్కయ్యారు. ఇక తనూజ మాటకు నాగార్జున సైతం షాకయ్యారు. వాళ్లకి నచ్చి వాల్లు సపోర్ట్ చేస్తే హ్యాపీగా అది తీసుకుంటా.. నేను వెళ్లి అడగటం వేరు.. వాళ్లకి వాళ్లే వచ్చి సపోర్ట్ చేయడం వేరు అంటూ వివరణ ఇవ్వడంతో అంతా సెలైంట్ అయ్యారు.

ఇక ఇప్పుడు తనూజ మాటలకు నెటిజన్స్ సైతం నోరెళ్లపెట్టారు. ఇందుకు సంబంధించిన క్లిప్ వీడియోస్ షేర్ చేస్తూ తనూజను ఓ ఆటాడుకుంటున్నారు. తన మాటలను తాము ఒప్పుకోవడం లేదంటూ అభిప్రాయపడ్డారు. హౌస్ లో సపోర్ట్ కోసం పరిగెత్తే తనూజ.. తనకు సపోర్ట్ లేరని చెప్పడం వింతగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆమె టాస్కులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ తనూజకు ఇచ్చిపడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్