AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : పవన్‏ను ఊతికారేసిన నాగార్జున.. వీడియో చూపించి మరీ క్లాస్.. మోకాళ్లపై కూర్చొని రీతూకు క్షమాపణలు..

బిగ్ బాస్ సీజన్ 9.. శనివారం నాటి ఎపిసోడ్ లో ఒక్కొక్కరికి కత్తితో పొడిచి మరీ క్లాస్ తీసుకున్నారు హోస్ట్ నాగార్జున. ముఖ్యంగా రీతూతో డీమాన్ ప్రవర్తించిన తీరుపై నాగ్ మండిపడ్డారు. వీడియో చూపించి మరీ ఊతికారేశారు. చివరకు మోకాళ్లపై కూర్చొపెట్టి మరీ క్షమాపణలు చెప్పించారు. ఇంతకీ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Bigg Boss 9 Telugu : పవన్‏ను ఊతికారేసిన నాగార్జున.. వీడియో చూపించి మరీ క్లాస్.. మోకాళ్లపై కూర్చొని రీతూకు క్షమాపణలు..
Bigg Boss 9 Telugu (3)
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2025 | 7:55 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం ఎపిసోడ్ లో రావడంతోనే శుక్రవారం నాటి ఎపిసోడ్ చూపించారు. బిర్యానీ దగ్గర భరణి, మాధురి మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్యలో దివ్య కలగజేసుకోవడంతో మాధురి మరింత ఫైర్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరి ఫోటో ఫ్రేమ్స్ కు కత్తిని గుచ్చుతూ క్లాస్ తీసుకున్నారు నాగార్జున. నామినేషన్లలోకి రాగానే సంజన నోటికి కంట్రోల్ ఉండట్లేదని క్లాస్ తీసుకున్నారు. స్నేహంలో తప్పులు వెతకడం, షటప్ అనడం అవసరమా.. ? నోరు జారితే ఎలా? అంటూ సున్నితంగా మాధురిని హెచ్చరించారు. ఇక తర్వాత తనూజ, కళ్యాణ్ గొడవకు కారణం ఇమ్మాన్యుయేల్ అని దివ్య చెప్పింది. భరణి, మాధురి బిర్యానీ గొవడలో నువ్వేందుకు వెళ్లావు.. ? భరణి తరుపున వకాల్తా పుచ్చుకున్నావా ? అని కౌంటరిచ్చారు. చివరకు డీమాన్ పవన్ కు జీవితంలో మర్చిపోలేని క్లాస్ తీసుకున్నారు.

రీతూను పవన్ కోపంతో బెడ్ పైకి తోసేయడం వీడియోను చూపించి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆడపిల్లపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పని .. బ్యాగ్ సర్దుకో.. డోర్స్ ఓపెన్ అంటూ సీరియస్ అయ్యారు. అయితే డీమాన్ తప్పు లేదని.. కోపంతో వెళ్లిపోతుంటే.. ఆపేందుకు ట్రై చేశాడని చెప్పుకొచ్చింది రీతూ. డీమాన్ చేసింది తప్పా కాదా.. ? అని నిన్ను అడగడం లేదు.. నిన్ను అడిగినా నువ్వు ఎలాగూ తప్పు కాదు అని అంటావ్.. అంటూ కౌంటరిచ్చారు నాగ్. మరోసారి రిపీట్ చేయడు సర్.. ఇద్దరం గొడవపడుతున్నాం. నేను వెళ్లిపోతున్నాననే ఆవేశంలో అలా తోశాడు అని రీతు చెప్పడంతో.. ఇది మీ ఇద్దరికీ సంబంధించిన విషయమే కాదు.. కోపంలో అయినా.. ఆవేశంలో అయినా.. ఆడపిల్లను అలా తోయడం కరెక్ట్ కాదు.. బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేయండి.. పవన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటూ సీరియస్ అయ్యారు.

ఆ తర్వాత నాగార్జున బ్రేక్ తీసుకోవడంతో పక్కకు వెళ్లిన రీతూ, డీమాన్ కు సర్దిచెప్పడం స్టార్ట్ చేసింది. నువ్వు కోపంలో అలా చేశావ్ నాన్నా.. నాకు తెలుసు నాన్నా. సారీ చెప్పులే సరిపోద్ది అంటూ మరోసారి హగ్ చేసుకుంది. ఇక తర్వాత సారీ సార్.. ఇంకోసారి రిపీట్ చేయను అంటూ చెప్పుకొచ్చాడు డీమాన్ పవన్. ఈ ఒక్కసారికి క్షమించండి సార్ అని డీమాన్ చేతులు జోడించి అడిగాడు. దీంతో నాగార్జున హౌస్మేట్స్ అభిప్రాయాన్ని అడిగారు. అందరూ పవన్ కు సపోర్ట్ చేశారు. ఇది హౌస్ కు మాత్రమే కాదు.. షో ఇమేజ్ గురించి సంబంధించిన విషయం.. మీ తర్వాత చాలా సీజన్స్ ఉంటాయి.. మీ తర్వాత వచ్చే వాళ్లు కూడా ఉంటారు .. ఇది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు. హౌస్ లో ఇలాగే బిహేవ్ చేస్తే షో పడిపోతుందని అన్నారు నాగార్జున.

వీడియో చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది. మీ బాండింగ్ ను అన్ హెల్తీ అని అడగానికి మాధురికీ ఏం హక్కు అనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే.. ఖచ్చితంగా అన్ హెల్తీ బాండింగ్ అనిపిస్తుంది అని అన్నారు నాగార్జున. ఇక చివరకు మోకాళ్లపై కూర్చుని.. నేను అ లా చేసి ఉండకూడదు. ఫ్యూచర్‌లో రిపీట్ చేయను. మీరు నాకు వేరే ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను అని క్షమాపణ చెప్పాడు పవన్. ఇది లైఫ్ లెసన్ పవన్.. నీకోసం హౌస్ మొత్తం స్టాండ్ తీసుకున్నారు.. నీ క్యారెక్టర్‌కి సర్టిఫికేట్ ఇచ్చారు.. నువ్వు కూడా అవతల వాళ్ల క్యారెక్టర్‌పై నింద పడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి అంటూ మరోసారి పవన్ కు క్లాస్ తీసుకున్నారు నాగార్జున.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..