AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : నాన్నకు తెలియకుండానే బిగ్‏బాస్ హౌస్‏లోకి.. ఫస్ట్ కంటెస్టెంట్ తనూజ గురించి తెలుసా.. ?

అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్ 9 తెలుగు షో అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా హోస్ట్ నాగార్జున సోనియా సోనియా పాటతో సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. ఈ సీజన్‌లో రంగంలోకి దిగే అర్జునున్ని చూస్తారని చెప్పారు బిగ్ బాస్ ఆ తర్వాత ఈసారి బిగ్‏బాస్ హౌస్ ను స్వయంగా చూపించారు.

Bigg Boss 9 Telugu : నాన్నకు తెలియకుండానే బిగ్‏బాస్ హౌస్‏లోకి.. ఫస్ట్ కంటెస్టెంట్ తనూజ గురించి తెలుసా.. ?
Tanuja Gowda
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2025 | 7:37 PM

Share

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్ 9 గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి చదరంగం కాదు..రణరంగమే అంటూ బిగ్‏బాస్ సీజన్ 9 పై అంచనాలు పెంచేశారు నాగార్జున. సెప్టెంబర్ 7న సాయంత్రం మొదలైన బిగ్‏బాస్ గ్రాండ్ లాంచ్ లో హోస్ట్ గా మరింత స్టైలీష్ గా ఎంట్రీ ఇచ్చారు. నెట్టింట ట్రెండ్ అవుతున్న రక్షకుడు సినిమాలోని సోనియా సోనియా పాటతో అద్భుతమైన డ్యాన్స్ తో కట్టిపడేశారు నాగార్జున. ఆ తర్వాత ఇంద్రభవనం లాంటి హౌస్ చూడాలంటే నాగార్జున టాస్కు కంప్లీట్ చేయాలని అన్నారు బిగ్ బాస్. ఇంటి లోపలి వంటగది, బెడ్ రూమ్, మరిన్నింటికి యాక్సెస్ అన్‌లాక్ చేయడానికి హోస్ట్ నాగార్జున వరుస టాస్కులు కంప్లీట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..

ఇవి కూడా చదవండి

బిగ్‏బాస్ సీజన్ 9లోకి మొదటి కంటెస్టెంట్ గా ముద్ద మందారం సీరియల్ ఫేమ్ తనూజ గౌడ జరగండి జరగండి అంటూ అందమైన డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ తన తండ్రికి తెలియకుండానే బిగ్ బాస్ లోకి వస్తున్నానని.. తనతో మాట్లాడరని చెప్పుకొచ్చింది. దీంతో తనూజ తండ్రిని నాగార్జున రిక్వెస్ట్ చేశారు. ఆమె అసలు పేరు తనూజ పుట్టస్వామి. కన్నడలో పలు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ముద్ద మందారం సీరియల్ తో తెలుగులో ఫేమస్ అయ్యింది. ఈ సీరియల్ అప్పట్లో బుల్లితెరపై సంచలనం సృష్టించింది. తనూజ బెంగుళూరులో పుట్టి పెరిగింది. బెంగుళూరు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. కానీ ఈ అమ్మడుకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది..

కన్నడ హారర్ సినిమా 6-5=2 సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దండే బాయ్స్ చిత్రంలో కనిపించింది. తెలుగులో ముందుగా అందాల రాక్షసి అనే సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముద్ద మందారం సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. ఇందులో పార్వతి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సీరియల్ తర్వాత పూర్తిగా తమిళ చిత్రపరిశ్రమకు షిఫ్ట్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఈ అమ్మడు స్టార్ మాలో వస్తున్న కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొంటుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు 174K కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?