Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ సీజన్ 9లోకి వెళ్లిన సామాన్యుడు ఇతడే.. కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే..
బిగ్‌బాస్ సీజన్ 9 మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దీంతో కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో లిస్టులు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా తారల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అగ్నిపరీక్ష ద్వారా ముగ్గురు జడ్జీలు ఎంపిక చేసిన కామనర్స్ ఎవరనేది సైతం తెలియాల్సి ఉంది.

బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్. తెలుగులో 8 సీజన్స్ విజయవంతంగా పూర్తైన ఈ షో.. ఇప్పుడు సీజన్ 9 ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 7న సాయంత్రం 7 గంటలకు ఈ షో గ్రాండ్ లాంచ్ కానుంది. అయితే గత సీజన్లకు భిన్నంగా ఈసారి సీజన్ 9 ఉంటుందని ముందు నుంచి టాక్ నడుస్తుంది. మరోవైపు ఈ సీజన్ పై భారీగా హైప్ ఇచ్చారు నాగార్జున. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే అంటూ అంచనాలు భారీగా పెంచేశారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన తారలు.. సీరియల్ సెలబ్రెటీలతోపాటు ఈసారి సామాన్యుల ఎంపిక కోసం అగ్నిపరీక్ష ను ప్రారంభించారు. దీనికి నవదీప్, అభిజిత్, బింధుమాధవిలను జడ్జీలుగా వ్యవహరించగా.. శ్రీముఖి హోస్టింగ్ చేశారు. ఇందులో మొత్తం 13 మందిని ఎంపిక చేసి.. అందులో నేరుగా 5గురిని నేరుగా ఇంట్లోకి పంపించనున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..
అయితే ఎప్పుడూ కంటెస్టెంట్స్ ఎవరనేది లాంచ్ రోజున మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడు అగ్నిపరీక్ష తో ముందుగానే కామన్ కేటగిరి కంటెస్టెంట్స్ రెడీ అయిపోయారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మాస్క్ మెన్ హరీష్ సామాన్యుల కోటాలో బిగ్‌బాస్ హోస్ లోకి అడుగుపెట్టబోయే తొలి కంటెస్టెంట్ అని తెలుస్తోంది. ఇక అగ్నిపరీక్ష ద్వారా టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఎంపికైన ఐదుగురు మాస్క్ మెన్ హరీష్ అలియాస్ హరిత హరీష్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కళ్యాణ్, మర్యాద మనీష్, దివ్యా నికితా ఉన్నట్లు సమాచారం. ఈ ఐదుగురు సామాన్యుల కేటగిరిలో హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
ఇక ఇప్పుడు వినిపిస్తున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..
- సంజన గల్రానీ
- రీతు చౌదరి
- తనుజా గౌడ
- ఆశా సైని (ఫ్లోరా సైని)
- శ్రష్టి వర్మ
- భవానీ శంకర్
- సుమన్ శెట్టి
- ఇమ్మాన్యుయేల్
- రాము రాథోడ్
- అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష
- సింగర్ శ్రీతేజ
- దువ్వాడ మాధురి
వీళ్లందరు ఈసారి సీజన్ 9లో కనిపించనున్నారని సమాచారం. ఈ 12 మందిని కాకుండా అగ్నిపరీక్ష అడిషన్స్ లో సెలక్ట్ అయిన మరో ఆరుగురిని హౌస్ లోకి పంపించనున్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?




