Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్.. అసలు కంటెస్టెంట్స్‌ను ఎలా సెలక్ట్ చేస్తారో తెలుసా.. ?
బుల్లితెరపై, సోషల్ మీడియాలో బిగ్‌బాస్ సందడి మొదలైంది. ఇప్పటివరకు 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు మరికొన్ని గంటల్లో సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. హాట్ స్టార్ లో 24*7 లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఎప్పటిలాగే కింగ్ నాగార్జున హోస్టింగ్ చేయనున్నారు. మొదటి నుంచి కంటెస్టెంట్స్ ఎవరనేది తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సందడి స్టార్ట్ అయ్యింది. ఈరోజు (సెప్టెంబర్ 7న) సాయంత్రం 7 గంటలకు తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. మరికొన్ని గంటల్లో ఈసారి కంటెస్టెంట్స్ ఎవరనేది రివీల్ కానుంది. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. సినిమా సెలబ్రెటీల నుంచి సీరియల్ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్స్ ఇలా ఎంతో మంది హౌస్ లోకి అడుగుపెట్టి తమ ఉనికిని నిరూపించుకుంటున్నారు. అలాగే బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయినవారు ఉన్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఉందని తెలిసిందే. అయితే ఈసారి తెలుగు సీజన్ 9లో ఎన్నో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈసారి హౌస్ లోకి కామన్ మ్యాన్ కేటగిరిలో ఐదుగురు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..
బిగ్‌బాస్ షోకు ఎలా ఎంపిక చేస్తారు.. ?
బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రారంభానికి ముందే సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ పేర్లు చక్కర్లు కొడుతుంటాయి. ఎవరెవరు ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్ నడుస్తుంటుంది. అయితే ఈ బిగ్‌బాస్ షోకు కంటెస్టెంట్స్ ను ఎలా ఎంపిక చేస్తారనే విషయం చాలా మంది అర్థంకాదు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణంగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నవారికి బిగ్‌బాస్ సరైన వేదిక. ఇదివరకు ఎంతో మంది తారలు సినిమాల నుంచి బిగ్‌బాస్ షో వరకు వచ్చారు. అలాగే ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నవారిని ఎక్కువగా ఎంపిక చేస్తుంటారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
ఈ షో కోసం ఎక్కువగా పాపులారిటీ ఎక్కువగా ఉన్న తారలను ఎంపిక చేసేందుకు ముందుంటారు. అలాగే ఫేమ్ ఉన్నవారితోపాటు అన్ని విధాలుగా జనాలను అలరించేవారిని సైతం ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ఎంతో మంది తమ ప్రతిభతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అందులో చాలా వరకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉండి జనాలను దగ్గరైన వారినే ఎంపిక చేసుకుంటారు. ముఖ్యంగా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్ లిమిటెడ్ ఫన్, గొడవలతో సాగుతుంది బిగ్‌బాస్.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?








