Keerthi Bhatt : అనాథను అని తెలిసి బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు.. బిగ్ బాస్ కీర్తి ఎమోషనల్..

మనసిచ్చి చూడు ధారవాహిక ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి.. బిగ్ బాస్ షోతో ఎంతో మంది కుటుంబసభ్యులను సంపాదించుకుంది. అయితే విధి కాటుకు కుటుంబాన్ని కోల్పోయిన కీర్తి.. అనాథ కావడంతో ప్రేమను కూడా కోల్పోయిందట.

Keerthi Bhatt : అనాథను అని తెలిసి బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు.. బిగ్ బాస్ కీర్తి ఎమోషనల్..
Keerthi Bhatt
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2022 | 9:46 PM

బిగ్ బాస్ సీజన్ 6లో కీర్తి భట్ స్పెషల్. ఆమె జీవితంలో ఎన్నో విషాదాలున్న.. ఆత్మస్థైర్యంతో 20 మంది కంటెస్టెంట్స్ మధ్యలో తనను తాను నిరూపించుకుంది. మొదటి రోజు నుంచి ఎంతో డల్ గా కనిపించినా ఆ అమ్మాయి చూసి విసుక్కున్న వాళ్లు.. ఆమె ఎదుర్కొన్న కష్టాలు.. వాటిన్నంటిని ఎదుర్కొంటూ ఒంటరిగా సాగిస్తున్న ప్రయాణం.. తన ప్రవర్తన చూసి టాప్ 3గా స్థానం కల్పించారు. ఈ సీజన్లో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. డబ్బులు ఎర చూపిన వద్దంటూ అభిమానులు తనను ఏ పొజిషన్ లో చూడాలనుకుంటున్నారో ఆ స్థానానికే కట్టుబడి ఉంటానంది. అలా మూడో స్థానంలో నిలిచి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. మనసిచ్చి చూడు ధారవాహిక ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి.. బిగ్ బాస్ షోతో ఎంతో మంది కుటుంబసభ్యులను సంపాదించుకుంది. అయితే విధి కాటుకు కుటుంబాన్ని కోల్పోయిన కీర్తి.. అనాథ కావడంతో ప్రేమను కూడా కోల్పోయిందట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. ” నేను ఒకతడిని ప్రేమించాను. కొద్ది రోజులు ఇద్దరం బాగానే ఉన్నాం. కానీ ఓ పరిస్థితిలో అతను నాకు బ్రేకప్ చేప్పి వదిలేశాడు.ఎందుకంటే నాకు బ్యాగ్రౌండ్ లేదు. నేను ఏం చేసి ఇండస్ట్రీకి వచ్చానో అన్న అనుమానంతో వదిలేశాడు. ఇక్కడిదాకా వచ్చిందంటే ఏం చేసి వచ్చిందో అని దగ్గరివాళ్లే చులకనగా మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అలాంటిది అతడు అర్థం చేసుకుంటారా ?. అతడికి అలా అనిపించందంటే నేను తప్పుడు వ్యక్తిని ఎంపిక చేసుకున్నట్లే కదా. ఇంకా ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడితే మళ్లీ ఏడ్చుకుంటూ ఉండిపోతాను. ఇప్పుడంతా హ్యాపీగా ఉంది. త్వరలోనే మళ్లీ ఓ పాపను దత్తత తీసుకుంటాను. ” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.