AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnupriya- Anchor Shyamala : యాంకర్ శ్యామల బాటలోనే విష్ణు ప్రియ.. బెట్టింగ్ కేసులో ఇద్దరిదీ ఒకేదారి..

తెలంగాణలో బెట్టింగ్ కేసుల దుమారం మారుమోగుతుంది. ఇప్పటికే రెండు పోలీస్ స్టేషన్లను పరిధిలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇతరుణంలో కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే హైకోర్టులను ఆశ్రయించి తమను అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ లు దాఖలు చేస్తున్నారు.

Vishnupriya- Anchor Shyamala : యాంకర్ శ్యామల బాటలోనే విష్ణు ప్రియ.. బెట్టింగ్ కేసులో ఇద్దరిదీ ఒకేదారి..
Anchor Shyamala, Vishnupriy
Lakshmi Praneetha Perugu
| Edited By: Rajitha Chanti|

Updated on: Mar 28, 2025 | 5:12 PM

Share

కొద్ది రోజుల క్రితం యాంకర్ శ్యామల ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించింది. తన మీద నమోదైన రెండు కేసులలో పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అయితే రూల్ ప్రకారం దర్యాప్తు అధికారులకు సహకరించాలని చెబుతూ శ్యామలాను పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఇక తాజాగా శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటు శ్యామలాని పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్ లని ఎవరు ప్రమోట్ చేయవద్దు అని శ్యామల మీడియా ముందు విజ్ఞప్తి చేసింది.

ఇక తాజాగా యాంకర్ శ్యామల బాటలోనే యాంకర్ విష్ణుప్రియ నడుస్తుంది. తనకు పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కలిగించాలని కోరుతూ విష్ణు ప్రియ హైకోర్టులో ముందస్తు మెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. మియాపూర్ తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ను కొట్టివేయాలని కోరుతూ విష్ణు ప్రియ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. యాంకర్ శ్యామల కేసులో ఇచ్చిన ఉత్తర్వులనే విష్ణు ప్రియకు హైకోర్టు వచ్చింది. దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా విష్ణు ప్రియ ను ఆదేశించింది.

విచారణ సందర్భంగా మియాపూర్ తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసులను ఒకే కేసుగా పరిగణించి దానిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సిట్ బృందానికి బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాలు హైకోర్టు కు తెలిపాడు.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..