Pushpa 2: అక్కడ రెండు వారాల ముందే పుష్ప రీరిలీజ్.. మేకర్స్ స్ట్రాటజీ అదేనా.. ?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 చిత్రం మరికొన్ని రోజుల్లో అడియన్స్ ముందుకు రానుంది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ విడుదల కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు మేకర్స్.

Pushpa 2: అక్కడ రెండు వారాల ముందే పుష్ప రీరిలీజ్.. మేకర్స్ స్ట్రాటజీ అదేనా.. ?
సక్సెస్‌కి సౌండ్‌ ఎక్కువ. మారుమోగిపోతుంది. లేటెస్ట్ గా పుష్ప ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఎంత సక్సెస్‌ అయిందో స్పెషల్‌గా ఎవరైనా చెప్పాలా.. ఏంటి.?
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2024 | 1:00 PM

పుష్ప 2పై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ కోసం యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ ప్రీ సేల్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజే రూ.270 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. దాదాపు అన్ని భాషలలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుకుమార్, బన్నీ కాంబోలో రాబోతున్న పుష్ప 2 చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్ప పార్ట్ 1కు దేవి అందించిన మ్యూజిక్ మరో హైలెట్ కాగా.. ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారో చూడాలి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే నవంబర్ 17న సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. . దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ట్రైలర్ లాంచ్ మెగా ఈవెంట్స్ నిర్వహించనున్నారు. మరోవైపు ఇప్పటికే పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. మరోవైపు యూఎస్ లో అడ్వాన్స్ ప్రీ బుకింగ్స్ రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇంత పీక్ మూమెంట్ లో యూఎస్ లో పుష్ప ఫస్ట్ పార్ట్ రీరిలీజ్ చేయనున్నారు. పుష్ప మొదటి భాగాన్ని నవంబర్ 19న రీరిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ మూవీ రీరిలీజ్ అయ్యే అన్ని థియేటర్లలో పుష్ప 2 ట్రైలర్ ప్రదర్శించనున్నారు. అందుకు కారణం లేకపోలేదు.

పుష్ప 2 సినిమాకు మరింత హైప్ తీసుకురావడానికి ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీకి భారీ హైప్ ఉంది. ఈ క్రమంలోనే మరోసారి పుష్ప మూవీని చూసేందుకు జనాలు థియేర్లకు వస్తారు. అలాగే పుష్ప సినిమా వెంటనే.. పుష్ప 2 పై మరింత క్యూరియాసిటీ.. బజ్ క్రియేట్ కావడం వల్ల సెకండ్ పార్ట్ కు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. దీంతో అమెరికాలో పుష్ప 2కు భారీ వసూళ్లు రావడం ఖాయం. దాదాపు 20+ మిలియన్ డాలర్స్ టార్గెట్ తో ఈ సినిమా బరిలోకి దిగుతుంది. ఆ టార్గెట్ అందుకోవాలంటే ప్రమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే ఇప్పుడు పుష్ప సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప రీరిలీజ్.. అదే థియేటర్లలో పుష్ప 2 రిలీజ్ తో మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలనే లక్ష్యంతో ఉన్నారు మేకర్స్. అందుకే ఇప్పుడు పుష్ప పార్ట్ వన్ రీరిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్