- Telugu News Photo Gallery Cinema photos Heroine Rashmika Mandanna plan her movies ready to Countinue releases next year, like kubera, Dhama , sikandar, chaava
Rashmika Mandanna: వరుస సినిమాలు ప్లాన్ చేసిన నేషనల్ క్రష్.! నెక్స్ట్ ఇయర్ అంత రష్మికకే..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ప్రజెంట్ వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ వరుస రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు. నెక్ట్స్ ఇయర్ ఏకంగా ఆరు రిలీజ్‌లు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నేషనల్ క్రష్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యానిమల్ తరువాత స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మళ్లీ తెర మీద కనిపించలేదు. అన్ని సినిమాలు షూటింగ్ స్టేజ్‌లోనే ఉండటంతో సిల్వర్ స్క్రీన్ మీద శ్రీవల్లికి కాస్త గ్యాప్ వచ్చింది.
Updated on: Nov 13, 2024 | 1:07 PM

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ప్రజెంట్ వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ వరుస రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు.

నెక్ట్స్ ఇయర్ ఏకంగా ఆరు రిలీజ్‌లు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నేషనల్ క్రష్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యానిమల్ తరువాత స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మళ్లీ తెర మీద కనిపించలేదు.

అన్ని సినిమాలు షూటింగ్ స్టేజ్‌లోనే ఉండటంతో సిల్వర్ స్క్రీన్ మీద శ్రీవల్లికి కాస్త గ్యాప్ వచ్చింది. అందుకే అప్ కమింగ్ సినిమాలతో ఆ గ్యాప్‌ను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు రష్మిక.

సౌత్ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీస్ అక్కడ కమర్షియల్ ఇమేజ్ తెచ్చుకున్న దాఖలాలు ఇంత వరకు లేవు.

డిసెంబర్‌లో ఈ క్రేజీ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు రష్మిక. ఆ తరువాత బాలీవుడ్ మూవీ ఛావా రిలీజ్ కానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ధనుష్, నాగార్జున లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న కుబేర సినిమాలోనూ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఛావాతో పాటు బాలీవుడ్‌లో మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు రష్మిక. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సికందర్‌ను ఈద్‌కు రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది యూనిట్.

స్త్రీ 2 మేకర్స్ రూపొందిస్తున్న హారర్ మూవీ థామ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలన్ని కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.




