Amala Paul Web Series: త్వరలో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు అమలాపాల్.. ఎనిమిది ఎపిసోడ్స్‌తో థ్రిల్లర్ స్టోరీ..

Amala Paul Web Series: ఓటీటీ పుణ్యమా అని పలు వెబ్ సిరీస్‌లు విజయవంతం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి వాటిపైనే పడింది. చిన్నా పెద్దా

Amala Paul Web Series: త్వరలో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు అమలాపాల్.. ఎనిమిది ఎపిసోడ్స్‌తో థ్రిల్లర్ స్టోరీ..
Follow us
uppula Raju

|

Updated on: Jan 24, 2021 | 12:54 PM

Amala Paul Web Series: ఓటీటీ పుణ్యమా అని పలు వెబ్ సిరీస్‌లు విజయవంతం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి వాటిపైనే పడింది. చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ వెబ్ సిరీసుల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఓరియేంటెడ్‌గా తెరకెక్కిస్తున్నారు. నష్టాలు తక్కువడా రావడంతో పాటు మినిమమ్ గ్యారెంటీగా నమ్మకం కలిగించడంతో అందరూ ఇదే బాట పట్టారు. తాజాగా పవన్ కుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ గా రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఆహా సంస్థ వారు ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ తో అమలాపాల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా కూడా వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే అమలాపాల్ కూడా పయనిస్తోంది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

వరుసగా ఐదు సినిమాలు హిట్.. విజయ పరంపరలో అనిల్ రావిపూడి..