వరుసగా ఐదు సినిమాలు హిట్.. విజయ పరంపరలో అనిల్ రావిపూడి..

వరుసగా ఐదు సినిమాలు హిట్.. విజయ పరంపరలో అనిల్ రావిపూడి.. వరుసగా ఐదు సినిమాలు హిట్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

  • uppula Raju
  • Publish Date - 10:53 am, Mon, 23 November 20

వరుసగా ఐదు సినిమాలు హిట్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. హీరోలు, నిర్మాతలు తనపై పెట్టుకున్న నమ్మకమే ప్రస్తుతం తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన తను డైరెక్ట్ చేసే సినిమాల గురించి మరిన్ని విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.

హాస్యం, కుటంబ విలువల నేపథ్యంలో సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు అనిల్ రావిపూడి. ఆయన డైరెక్ట్ చేసిన పటాస్, సుప్రీమ్, రాజాది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశాయి. ఇందులో ఏ సినిమా కా సినిమా వైవిధ్య భరితంగా ఉంటుంది. అయితే హీరో నందమూరి కల్యాణ్‌రామ్ తనన నమ్మి పటాస్‌కు అవకాశం ఇవ్వడం వల్లే తను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. గత సంవత్సరం సంక్రాంతికి రిలీజైన ఎఫ్2 సినిమా దర్శకుడిగా తనకు గుర్తింపు తెచ్చిన సినిమాగా చెప్పారు. ఈ సినిమా ఇండియన్ మనో రమకు ఎంపికై ఉత్తమ సినిమాగా నిలిచింది అందుకే దీనికి సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్నారు అనిల్. డిసెంబర్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం సరిలేరు నీకెవ్వరూ తో విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజునే కొడుకు పుట్టాడు. దీంతో పుత్రోత్సాహంతో ఈ సినిమా వేడుకలు జరుపుకుంటున్నానని ఆనందంతో ప్రకటించారు. ఇక ఇండస్ట్రీలో దర్శకుడిగా విజయం సాధించడంతో పాటు ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నానని.. దీంతో దర్శకత్వంతో పాటు నిర్మాణం కొనసాగించాలని తన మనసులో మాట వెల్లడించారు. అయితే కరోనాతో విసిగివేజారిన ప్రజలకు ఎఫ్3 ఒక రిలీఫ్ ఇస్తుందని నమ్మకంగా చెప్పారు.