AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు.. లిస్టులో పవన్ ‘ఓజీ’తో సహా ఏమేం ఉన్నాయంటే?

ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పవన్ కల్యాణ్ ఓజీ. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు.. లిస్టులో పవన్ 'ఓజీ'తో సహా ఏమేం ఉన్నాయంటే?
OTT Movies
Basha Shek
|

Updated on: Oct 20, 2025 | 1:21 PM

Share

ప్రస్తుతం థియేటర్ల దగ్గర దీపావళి సందడి నెలకొంది. కాంతార ఛాప్టర్ 1తో పాటు మిత్రమండలి, తెలుసుకదా, డ్యూడ్‌, కె-ర్యాంప్‌ వంటి సినిమాలు థియేటర్లలో సందడి నెలకొంది. వీటికి పోటీగా ఈ వారం రష్మిక మందన్నా థామా బిగ్ స్క్రీన్ పై ప్రత్యక్షం కానుంది. అలాగే తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన బైసన్ కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. ఇందులో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించాడు. అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. మరోవైపు ఓటీటీలోనూ సూపర్ హిట్ సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు విజయ్ ఆంటోని నటించిన భద్రకాళి సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. అలాగే హిందీ, కన్నడ, మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి అక్టోబర్ నాలుగో వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో ఓ లుక్కేద్దాం రండి.

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్‌

  • మాబ్‌ వార్‌: ఫిలడెల్ఫియా వర్సెస్‌ ద మాఫియా (డాక్యుమెంటరీ వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 22
  • ద మాన్‌స్టర్‌ ఆఫ్‌ ఫ్లోరెస్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 22
  • ఓజీ – అక్టోబర్‌ 23

  • నోబడీ వాంట్స్‌ దిస్‌ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 23
  • ద ఎలిక్సిర్‌ – అక్టోబర్‌ 2
  • కురుక్షేత్రం – పార్ట్‌ 2 (యానిమేటెడ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 24
  • ఎ హౌజ్‌ ఆఫ్‌ డైనమైట్‌ – అక్టోబర్‌ 24
  • పరిష్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 24
  • ది డ్రీమ్‌ లైఫ్‌ ఆఫ్‌ మిస్టర్‌ కిమ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • ఎలివేషన్‌: అక్టోబర్‌ 21
  • లజారస్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 22
  • విషియస్‌ – అక్టోబర్‌ 22
  • ఈడెన్‌ – అక్టోబర్‌ 24
  • పరమ్‌ సుందరి – అక్టోబర్‌ 24

జియో హాట్‌స్టార్‌

  • భద్రకాళి – అక్టోబర్‌ 24
  • మహాభారత్‌: ఏక్‌ ధర్మయుధ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25
  • పిచ్‌ టు గెట్‌ రిచ్‌ (రియాలిటీ షో) – అక్టోబర్‌ 20

సన్‌ నెక్స్ట్‌

  • ఇంబం – అక్టోబర్‌ 20

సింప్లీ సౌత్‌

  • దండకారణ్యం – అక్టోబర్‌ 20

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.