AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sriranga Neethulu OTT: సైలెంట్‌ గా ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ లేటెస్ట్ సినిమా .. ఎక్కడ చూడొచ్చంటే?

రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్, ప్రసన్న వదనం.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ హీరో సుహాస్. హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న అతను నటించిన మరో చిత్రం శ్రీరంగ నీతులు. వీఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో బేబీ హీరో విరాజ్ అశ్విన్, కేరాఫ్ కంచర పాలెంట నటుడు కార్తీక్ రత్నం, రుహానీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Sriranga Neethulu OTT: సైలెంట్‌ గా ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ లేటెస్ట్ సినిమా .. ఎక్కడ చూడొచ్చంటే?
Sriranga Neethulu Movie
Basha Shek
|

Updated on: May 29, 2024 | 4:23 PM

Share

రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్, ప్రసన్న వదనం.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ హీరో సుహాస్. హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న అతను నటించిన మరో చిత్రం శ్రీరంగ నీతులు. వీఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో బేబీ హీరో విరాజ్ అశ్విన్, కేరాఫ్ కంచర పాలెంట నటుడు కార్తీక్ రత్నం, రుహానీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 11 న థియేటర్లలో విడుదలైన శ్రీరంగ నీతులు మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సుహాస్ గత సినిమాలతో పోలిక రావడం, అంచనాలు పెరగడంతో చాలా మంది జనాలు శ్రీరంగ నీతులు సినిమాపై పెదవి విరిచారు. అయితే ఎప్పటిలాగే సుహాస్ తన నటనతో ఆక్టటుకున్నాడు. విరాజ్ అశ్విన్, కార్తక్ రత్నం ల పాత్రలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని టాక్ వచ్చింది. ఇలా థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన శ్రీరంగ నీతులు సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. అయితే మొదట ఈ సినిమాను నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మే 30వ తేదీన యూట్యూబ్‏లో శ్రీభవానీ హెచ్ డీ మూవీస్ ఛానెల్ లో శ్రీరంగ నీతులు సినిమాను టెలికాస్ట్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఒక్కరోజు ముందే అంటే బుధవారం (మే 29) శ్రీరంగ నీతులు సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన, సమాచారం లేకుండానే.

శ్రీరంగ నీతులు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. రాధావి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేశ్వరరావు బల్మూరీ నిర్మించిన ఈ సస్పెన్స్ డ్రామాలో తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, రాగ్ మయూర్, దేవీ ప్రసాద్, సంజయ్ స్వరూప్, గీతా భాస్కర్, సీవీఎల్ నరసింహరావు, జీవన్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, అజయ్ అరసాద సంగీతం అందించారు. మరి శ్రీరంగ నీతులు సినిమాను థియేటర్లలో మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆనందించండి.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

రేపటి నుంచి యూట్యూబ్ లోనూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.