AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keechurallu OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎందులోనంటే?

ఓటీటీల్లో మలయాళ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందుకే ఆయా భాషలకు తగ్గట్టుగా డబ్బింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. అలా మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అది కూడా తెలుగు వెర్షన్ తో

Keechurallu OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎందులోనంటే?
Keechurallu Movie
Basha Shek
|

Updated on: May 29, 2024 | 9:53 PM

Share

ప్రస్తుతం మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ మాలీవుడ్ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీల్లో మలయాళ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందుకే ఆయా భాషలకు తగ్గట్టుగా డబ్బింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. అలా మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అది కూడా తెలుగు వెర్షన్ తో. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కేరళ బ్యూటీ రజిషా విజయన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం కీడం. రాహుల్ రిజీ నాయర్ దర్శకత్వం వహించిన ఈ సైబ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్… 2022లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇవి కూడా చదవండి

అయితే సుమారు రెండేళ్ల తర్వాత తెలుగులో రిలీజ్ కానుంది. కీచు రాళ్లు పేరుతో తెలుగు వెర్షన్ ను రెడీ చేశారు. అయితే థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ వేదికగా గురువారం (మే 30) నుంచి ఈ థ్రిల్లర్ మూవీ అందుబాటులోకి రానుంది. అంటే ఇవాళ అర్ధ రాత్రి నుంచే కీచు రాళ్లు సినిమాను ఓటీటీలో చూడవచ్చన్న మాట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. అలాగే కీచు రాళ్లు సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సినిమా కథ ఏంటంటే? కీచు రాళ్లు సినిమాలో ర‌జిషా విజ‌య‌న్‌తో పాటు శ్రీనివాస‌న్‌, విజ‌య్ బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. రాధికా బాల‌న్ (ర‌జిషా విజ‌య‌న్‌) ఓ సైబ‌ర్ సెక్యూరిటీ స్టార్ట‌ప్ కంపెనీని ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా సైబర్ క్రైమ్ కు సంబంధించిన కేసులను పరిష్కరిస్తుంది. పోలీసులకు కూడా సహాయ సహకారాలు అందిస్తుంటుంది. అయితే అనుకోకుండా రాధికానే ఓ సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారిపోతుంది? ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంటాడు. మరి తన సమస్యను ఆమె ఎలా పరిష్కరించుకుందన్నదే కీచు రాళ్లు సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..